ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోలలో విశ్వక్ సేన్ ఒక్కడు. సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అనేది అందుకున్న విశ్వక్ సేన్.. ఆ తర్వాత నుండి వరుస సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటూ పోతున్నాడు. ఇక ఈ మధ్యే తాజాగా విశ్వక్ సేన్ నుండి ఓరి దేవుడా అనే సినిమా వచ్చింది.
Advertisement
ఇక ఈ సినిమా కంటే ముందే విశ్వక్ సేన్ తన కొత్త సినిమాను కమిట్ అయ్యాడు. యాక్షన్ కింగ్ అర్జున్ హోంబ్యానర్ శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్‌పై ఈ సినిమా రావాల్సింది. అయితే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా ఎప్పుడో పూర్తయ్యాయి. ఇక ఈ సినిమాను కథ అనేది అర్జున్ అందించగా.. ఇందులో హీరోయిన్ గా కూడా అర్జున్ కూతురు ఐశ్వర్య నటిస్తుంది. కానీ తాజాగా ఈ సినిమా ఆగిపోయింది అని తెలుస్తుంది.
Advertisement
మరి కొన్ని రోజులో ఈ సినిమా షూటింగ్ అనేది ప్రారంభం కావాల్సిన సమయంలో అర్జున్ కు అలాగే విశ్వక్ సేన్ కు మధ్య ఏదో విషయంలో గొడవ అనేది జరిగింది అని తెలుస్తుంది. దాంతో విశ్వక్ సేన్ ఈ సినిమా తప్పుకుంటున్నట్లు చెప్పాడట. అంతే.. కమిట్ అయిన సినిమా నుండి విశ్వక్ సేన్ తప్పుకుంటాను అనడంతో.. అర్జున్ నేరుగా ఫిలిం ఛాంబర్ కు వెళ్లి ఫిర్యాదు అనేది చేసినట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :