Home » మునుగోడు:వారి ఓట్లు ఆ పార్టీని గట్టెక్కించేనా..?

మునుగోడు:వారి ఓట్లు ఆ పార్టీని గట్టెక్కించేనా..?

by Sravanthi
Ad

మునుగోడు దేశంలోనే అత్యంత కాస్ట్లీ ఎన్నికగా పేరు తెచ్చుకుంది. మునుగోడు నియోజకవర్గంలో గెలిపే ఆయా పార్టీల రాబోయే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగాయి.. మరి ప్రజానాడి ఏ వైపు వెళ్ళిందో ఇప్పుడు చూద్దాం..
గెలుపు మాదే అంటున్న తెరాస:

మునుగోడులో 93.13 శాతం పోలింగ్ నమోదు మనం చూసాం. ఇందులో సైలెంట్ ఓటింగ్ జరిగిందని, ఈ ఓటింగ్ ఎవరికి పేవర్ గా ఉంటుంది.. ఎవరి కొంపముంచుతుంది అనే దానిపై కొన్ని విశ్లేషణలు వెలువడ్డాయి. ఎక్కువగా పోలింగ్ నమోదు సాధారణ ఎన్నికల్లో అయితే అధికార పార్టీకి నష్టమని అంచనా వేస్తారు. అయితే గతంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ ఇక్కడ ఉప ఎన్నిక కావడంతో అలా భావించడానికి వీల్లేదు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ పెరిగిన ఓటింగ్ శాతాన్ని బట్టి టిఆర్ఎస్ కి అనుకూలమని పార్టీ గెలుపు ఖాయమని అంటున్నాయి. కానీ మెజారిటీ చెప్పలేమంటూ తెలియజేశాయి.
విజయం మాదే అంటున్న బిజెపి:

Advertisement

Advertisement

సైలెంట్ ఓటింగ్ వల్ల కచ్చితంగా మేము గెలుస్తామని బిజెపి గట్టి నమ్మకంతో ఉంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం అనేక నిధులు కేటాయించింది. ఈ విధంగా మునుగోడు ఇంత త్వరగా అభివృద్ధి చెందడానికి కారణం బిజెపి అంటూ ప్రజలు భావిస్తున్నారని బిజెపి నేతలు అన్నారు. మెజార్టీ రాకపోయినా సరే స్వల్ప ఓట్లతో బయటపడతామని బిజెపి నమ్మకంతో ఉంది.
మహిళలు మావైపే అంటున్న కాంగ్రెస్:

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నిలబడడం తమకు అనుకూలంగా మారిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మహిళా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తాడం కూడా కలిసి వస్తుందని మా అభ్యర్థి గెలుస్తుందనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఏది ఏమైనా ఇంతటి ఉత్కంఠ పోరుకు ఎవరు ఎటువైపు నిలిచారు అనేది రేపు తేలిపోతుంది.

also read:

Visitors Are Also Reading