తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహాస్య నటీమణిగా పేరు తెచ్చుకున్నారు రమాప్రభ. ఆమె మహానటుల సరసన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్య నటిగా నటించి తెలుగు ప్రేక్షక అభిమానులను ఎంతగానో అలరించారు. ఆమె తన తమ్ముడిగా భావించే దివంగత నటుడు రాజబాబుతో కలిసి దాదాపు 300పైగా సినిమాల్లో నటించారంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో వీరి కాంబినేషన్ కు చాలా డిమాండ్ ఉండేది. అలాగే అల్లు రామలింగయ్య, రమణారెడ్డి వంటి గొప్ప హాస్య నటుల సరసన కూడా నటించి వావ్ అనిపించారు.
Also Read : కాంతార సినిమా కంటే ముందే తెలుగు సినిమాలో నటించిన రిషబ్ శెట్టి.. అది ఏ సినిమాలో తెలుసా ?
Advertisement
కమెడియన్ రేలంగి సరసన ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో కూడా నటించి తన నటన చాతుర్యాన్ని తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించారు. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ఆమె శరత్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ దాదాపు 13 సంవత్సరాల పాటు మాత్రమే తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. ఆ తర్వాత మనస్పార్థాల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల తరువాత అడపాదడపా తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మొన్నటి వరకు అలరించారు రమాప్రభ. ఎక్కువగా మదనపల్లిలో తన సమయాన్ని గడిపే రమాప్రభ సినిమా షూటింగ్ లో నిమిత్తం నగరానికి విచ్చేస్తారు తప్ప మిగతా అన్ని సమయాల్లో మదనపల్లి దాటి వెళ్లారు.
Advertisement
గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రమాప్రభ ఎవరికి తెలియని షాకింగ్ విషయాలు వెల్లడించి అందర్నీ విస్తు పోయేలా చేశారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ తన అల్లుడు అని, ఏడాది వయసులో ఉన్న తన అక్క కూతురు విజయ చాముండేశ్వరిని తాను దత్తత తీసుకున్నానని, ఆమెని రాజేంద్రప్రసాద్ కు ఇచ్చి పెళ్లి చేశానని రమాప్రభ వెల్లడించారు. అలాగే మా అసోసియేషన్ వల్ల తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చారు. తాను చనిపోయినా.. ఆ విషయాన్ని మా అసోసియేషన్ కి ఎవరు చెప్పవద్దని ఆమె ఇంటర్వ్యూలో కోరుతూ అందరినీ కంటతడి పెట్టించారు. మా అసోసియేషన్ వారు తనని అవమానించడంతో పాటు ఏ రోజు కూడా సముచిత గౌరవాన్ని ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరొక విస్తు పోయే వాస్తవం ఏంటంటే ఒకానొక దశలో రాజేంద్రప్రసాద్ మా అసోసియేషన్ కి చీఫ్ గా బాధ్యతలు వ్యవహరించారు. కానీ ఆ సమయంలో కూడా రమాప్రభ గౌరవ భంగం తప్ప లేదట.