Home » తగ్గనంటున్న త్రిష..!

తగ్గనంటున్న త్రిష..!

by Azhar
Ad

హీరోకి సినిమాల్లో అవకాశాలు కొన్ని ఏళ్ళు వస్తాయి. కానీ హీరోయిన్స్ కు మాత్రం అలా ఉండదు. వాళ్ళు ఎంత లేదన్న 10 ఏళ్ళు సినిమాల్లో హీరోయిన్ గా చేయగలరు. కానీ కొందరు మాత్రం తాము హీరోలకు తక్కువ కాదు అని సినిమాలు చేస్తుంటారు. అలాంటి వారిలో త్రిష కూడా ఉంటుంది. ఒక్కపుడు తమిళ్, తెలుగుతో పాటుగా మొత్తం సౌత్ లో వరుస సినిమాలతో త్రిష చాలా బిజీగా ఉండేది.

Advertisement

కానీ ఈ మధ్యేలో కేవలం తమిళ్ లో మాత్రమే సినిమాలు చేస్తుంది త్రిష. తెలుగులో ఎప్పుడో ఒక్క సినిమా చేస్తున్నది. అయితే ఇప్పటికే 30 ఏళ్ళు దాటినా త్రిష.. ఏజ్ కనిపించకుండా వరుస సినిమాలు చేస్తుంది. కానీ గత రెండేళ్లుగా ఆమెకు సరైన హిట్ అనేది లేదు. కానీ తాజాగా త్రిష ఖాతాలో సూపర్ హిట్ వచ్చి చేరింది.

Advertisement

మణిరత్నం దర్శకతంలో తమిళ బాహుబలిగా వచ్చిన పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాలో త్రిష.. యువరాణి కుందవై పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా హిట్ కావడం త్రిషకు మళ్ళీ ఎక్కువ ఆవకాశాలు వస్తున్నాయి. ఇక ఇదే అదును అనుకున్న త్రిష గత రెండేళ్లుగా తీసుకుంటున్న రెమ్యునరేషన్ అనేది పెంచింది అని తెలుస్తుంది. ఇన్ని రోజులు ఒక్క సినిమాకు కోటిన్నర నుండి రెండు కోట్లు తీసుకునే త్రిష.. ఇప్పుడు దానిని రెండింతలు చేసి.. ఏకంగా మూడు నుండి నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తుంది అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

మాకు ప్రపంచ కప్ వద్దు.. ఇండియాను కూడా గెలవనివ్వం..!

క్రికెట్ ఫ్యాన్స్ ను ఖుషి చేసిన ఇండిగో..!

Visitors Are Also Reading