మునుగోడులో ఈ నెల 31న జరగనున్న జేపీ నడ్డా సభ రద్దయ్యింది. ఆరోజు మండల స్థాయి సభలు పెట్టాలని చేస్తున్న బీజేపీ ప్లాన్ చేస్తోంది. 31న రెండు మున్సిపాలిటీలు, ఏడు మండలాల్లో బైక్ ర్యాలీలు, సభలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.
తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అధ్వర్యంలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన ర్యాలీ ప్రారంభం అయ్యింది. ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటున్నారు.
Advertisement
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలని, నిందితులను రిమాండ్‌కు తరలించేలా ఆదేశాలివ్వాలని పోలీసులు కోరుతున్నారు.
తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి భద్రత పెంపొందించారు. ఫోర్ ప్లస్ ఫోర్ గన్‌మెన్లను కేటాయిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 2+2 గన్‌మెన్లు రోహిత్ రెడ్డి కలిగి ఉండగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ను సైతం హోమ్ శాఖ మంజూరు చేసింది.
Advertisement
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుంది. కొమురం భీం జిల్లాలో 12.5గా కనిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వగా మంచిర్యాల జిల్లాలో 13.2గా, నిర్మల్ జిల్లాలో 14గా.. ఆదిలాబాద్ జిల్లాలో 14.1గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో 4వ రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల జంక్షన్ వరకు పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ 20.3 కిలోమీటర్ల వరకు పాదయాత్ర సాగనుంది.
టీ20 వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్‌తో శ్రీలంక తలపడనుంది. సిడ్నీ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కారు గుర్తుకు ఓటేయకుంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కపిల వాయి దిలీప్ కుమార్ సీఈఓకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మంత్రికి నోటీసులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు నియామకం అయ్యారు. రెండేళ్ళ పాటు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు.