హైదరాబాద్ పంజాగుట్టలో పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.70 లక్షలను అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వం కౌంటర్ దాకలు చేయబోతున్నట్టు సమాచారం.
Advertisement
నవంబర్ 1వ తేదీన హైదరాబాద్‌కి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచ్చేస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఖర్గే పాల్గొంటారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా నిన్న స్వామివారరిని 67,439 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,450 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత పెరుగుతుంది. పాడేరులో 14, మినుములూరులో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Advertisement
నిరుద్యోగం, ధరల పెరుగుదల దేశానికి శాపంగా మారాయని రాహుల్ గాంధీ అన్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉన్నప్పుడు విమర్శలు చేసిన మోదీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని బీజేపీ తెచ్చిన బిల్లులకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని విమర్శించారు.
టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదు అయ్యింది పాకిస్థాన్‌పై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది.
బిజెపి చీఫ్ బండి సంజయ్ నేడు యాదాద్రి లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పర్యటన కు అనుమతి లేదని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
మునుగోడు లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గిరాకీ ఓ రేంజ్ లో కనిపిస్తుంది. ఒక్కో పోస్టల్ బ్యాలెట్ ఓటును నేతలు 10 వేల వరకూ ఖర్చు చేసి కొనుగోలు చేస్తున్నారు.