సాధారణంగా అమవాస్య రోజు సూర్యగ్రహణం, పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దాదాపు 22 22 ఏళ్ల తరువాత అక్టోబర్ 25, 2022 రోజు పాక్షిక సూర్యగ్రహణం కనిపించింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇది సాయంత్రం 4.29 గంటలకు ప్రారంభమై.. 45 నిమిషాల పాటు కనిపించింది. తొలుత ఉత్తర భారతదేశంలో కనిపించగా.. ఆ తరువాత హైదరాబాద్‌లో సాయంత్రం 4.58 గంటల నుంచి 5.55 గంటల వరకు గ్రహణం కనిపించింది. గ్రహణం సమయంలో పూర్వకాలంలో రోకలిని నిలబెట్టేవారు. తాజాగా గ్రహణం ఏర్పడిన సమయంలో కూడా కొంత మంది ఇత్తడి పళ్లెంలో రోకలిని నిటారుగా నిలబెట్టారు. ఎలాంటి ఆధారం లేకుండా రోకలి నిలబడడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
Advertisement
రోకలిని నిలబెట్టిన వీడియోలను చాలా మంది సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గ్రహణం సమయంలో రోకలి ఎందుకు నిలబడుతుందని ఓ వ్యక్తి ట్విట్టర్ లో అడగ్గా.. మరో నెటిజన్ ఆయనకు సమాధానం ఇచ్చారు. మనకి టీవీలు, సమాచార వ్యవస్థ అంతగా లేనప్పుడు ప్రజలు గ్రహణం ప్రారంభం కావడం, ముగిసిపోవడం వంటివి తెలుసుకోవడానికి తాంబూలంలో నీరు పోసి రోకలిని తూర్పుదిశగా నిలబెడితే గ్రహణం పట్టే సమయంలో అది నిలబడుతుంది. అప్పుడు గ్రహణం పట్టిందని, తిరిగి రోకలి కింద పడిపోతే గ్రహణం విడిచిందని భావించే వారు. ఇప్పటికీ కూడా కొన్ని పల్లెటూర్లలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
Also Read : పూర్ణ పెళ్లికి ఆమె భర్త బంగారం ఎంత పెట్టారో తెలుసా..?
Advertisement
సైన్స్ ప్రకారం చూస్తే ఏదైనా వస్తువును పడిపోకుండా నిలబెట్టాలంటే భూ గురుత్వాకర్షణ శక్తి వల్ల దానికి కలిగే భారం దాని ఆధార పీఠం గుండా పయనించగలగాలి. పొడవు ఎక్కువగా ఉండి, పీఠం వైశాల్యం తక్కువగా ఉండే రోకలి లాంటి వస్తువును పడకుండా నిలబెట్టడం కొంత కష్టమైన పనే. కానీ అసాధ్యం కాదు. ప్రయత్నిస్తే నేల మీద లేదా ఏదైనా పళ్లెంలో నిలబెట్టవచ్చు. ఇందుకు ఉదాహరణ సన్నని, నిడుబాటి కర్రను కూడా నిలువుగా మనం అరచేతిలో లేదా చూపుడు వేలు చివరన బ్యాలెన్స్ చేయగలం. రెండు వస్తువుల మధ్య పని చేసే ఆకర్షణ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. గ్రహణం సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖపై వచ్చినప్పుడు సూర్య, చంద్రుల మధ్య ఉండే గురుత్వాకర్షణ ఒక్కటి అవుతుంది. అది భూమిని ఆకర్షిస్తుంది. ఆ బలం వస్తువులపై పని చేసే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో పని చేస్తుండడం వల్ల రోకలిని నిలబెట్టడం కొంచెం సులభమవుతుంది.
Also Read : పిల్లల జ్ఞాపకశక్తిని పెంచి, బాగా చదువుకునేలా చేసే పదార్ధాలు ఇవే..!
అదేవిధంగా పళ్లెంలో నీరు పోసి ఆ మధ్యలో కూడా రోకలిని నిలబెడతారు. అప్పుడు నీటి అణువుల వల్ల ఏర్పడే అసంజన బలాలు కూడా ఇందుకు దోహదపడుతాయి. అందుకే గ్రహణ సమయంలో రోకలి నిలబడుతుంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్‌ని స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. గ్రహణ సమయంలో రోకలి ఇత్తడి పళ్లెంలో లేదా రోలులో ఇలా నిలబడుతుందని కొందరూ చెబితే.. మరికొందరూ సాధారణ రోజుల్లో కూడా నిలబడుతుందంటున్నారు. గ్రహణం సమయంలోనే రోకలి నిలబడుతుందనేది మూఢనమ్మకం అని కొట్టి పడేస్తున్నారు. ఇక సాధారణ సమయంలో కూడా రోకలిని నిలబెట్టిన వీడియోలను సోషల్ మీడియాలో కొందరూ షేర్ చేయడం విశేషం.
Also Read : స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కవర్ యెల్లో కలర్లోకి ఎందుకు మారుతుందో తెలుసా ?