గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు నియోజకవర్గ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి.. అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఎవరికి వారే ప్రచారంలో మునిగిపోయారు. ముఖ్యంగా మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసి బిజెపిలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఎలాగైనా ఆ స్థానాన్ని గెలవాలని కంకణం కట్టుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి ప్రచారంలో ఉన్నారు.. ఇక బిఎస్ పి పార్టీ నుంచి కూడా అభ్యర్థులు పోటీ ఇస్తున్నారు.. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి మునుగోడు తలనొప్పిగా మారింది.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో కాల్ రికార్డు ఇటీవల బయటకు రావడంతో సంచలనంగా మారింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ వెంకట్ రెడ్డికి క్రమశిక్షణ రాహిత్య చర్యల కింద షోకాజ్ నోటీసులు పంపింది.
Advertisement
also read:ఆరోగ్యం గా ఉండాలంటే రోజుకు ఇన్ని గంటలు నిద్ర పోవాలా ?
Advertisement
10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. కట్ చేస్తే తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు బహిరంగ లేఖ రాశారు.. ఆయన ఏమన్నారంటే మునుగోడును కేవలం ఉప ఎన్నికగా చూడలేమని అన్నారు. కాంగ్రెస్ పార్టీని అంతం చేయడం కోసం బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నారని ఆరోపణ చేశారు. కాంగ్రెస్ బీక్షతో ఎదిగిన వాళ్లే వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి, యాదాద్రి దేవాలయాన్ని రాజకీయ లబ్ధికి వేదికగా మార్చారని లేఖలో పేర్కొన్నారు. ఆడబిడ్డ అని చూడకుండా పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడి చేశారని, గుండాల్లా ప్రవర్తిస్తున్నారని, సమయం ఆసన్నమైందని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కదం తొక్కుతూ మునుగోడు కదలిరావాలని పిలుపునిచ్చారు. మునుగోడు లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ప్రతి నేత, కార్యకర్త సైనికుల్లా నడుం బిగించాలని లేఖలో కోరారు..
కార్యకర్తల బాధ ఏంటంటే:
ఇప్పటికే మునుగోడు నియోజకవర్గం చాలా కాస్ట్లీ గా మారింది. అన్ని పార్టీల నుంచి కార్యకర్తలు, లీడర్లు మునుగోడులోనే తిష్ట వేశారు. దీంతో అక్కడ అన్ని ధరలు పెరిగిపోయాయి. కనీసం వెళ్లిన కార్యకర్తలు తలదాచుకోడానికి రూమ్స్ కూడా లేకుండా పోయాయి. కొన్ని రూములకు అయితే లక్షల్లో రెంట్లు చెల్లించి పార్టీ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ కార్యకర్తలు మునుగోడుకు రావడానికి సుముఖంగానే ఉన్న, రాష్ట్ర అధిష్టానం మాత్రం వారికోసం బస ఏర్పాట్లు ముందుగానే చేయాలని, అలా చేస్తే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త స్వచ్ఛందంగా మునుగోడుకు చేరుకుంటామని, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారని సమాచారం.
also read: