Home » పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన పూర్ణ.. నెటిజన్స్ ఆశ్చర్యం..!

పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన పూర్ణ.. నెటిజన్స్ ఆశ్చర్యం..!

by Anji
Ad

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లోకి వస్తుంటారు.. పోతుంటారు.. అందులో కొంత మంది మాత్రమే సెటిల్ అవుతుంటారు. వెండితెరపై సందడి చేసిన పూర్ణ బుల్లితెరపై జడ్జిగా అలరించింది ఆ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తెగ సందడి చేసింది. ఈ నేపథ్యంలో పూర్ణకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఒకప్పుడు హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది పూర్ణ. మధ్యలో గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు బుల్లితెరపై దుమ్ము లేపుతోంది. బుల్లితెరపై వచ్చిన క్రేజ్ ద్వారా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం చేసింది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో పూర్ణకు మంచి అవకాశాలు వస్తున్నాయి .పెద్ద సినిమాల్లో ఛాన్స్ వస్తున్నాయి. ఇటు సిల్వర్ స్క్రీన్ అటు స్మాల్ స్క్రీన్ లో పూర్ణ దుమ్ము లేపుతోంది.

Advertisement

కొన్ని నెలల క్రితం పూర్ణ తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. షానిద్ అసిఫ్ అలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. షానిద్ దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త. ఆయనకు ఒక బిజినెస్ గ్రూప్ ఉంది. ప్రకటించిన వెంటనే నిశ్చితార్థం చేసుకున్నారు. పూర్ణ అధికారిక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేశారు. కొద్ది రోజులుగా పెళ్లి విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో పెళ్లి రద్దయింది అనే రూమర్లు వచ్చాయి. కానీ అసలు విషయాన్నీ ఇప్పుడు చెప్పింది. పూర్ణ ఆల్రెడీ తన పెళ్లి జరిగిపోయినట్టు ప్రకటించేసింది. ఆసీఫ్ ఆలీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది. తమ ఎంగేజ్ మెంట్ ఈ ఏడాది మేలో జరిగిందని జూన్ లో దుబాయ్ వేదికగా తమ పెళ్లి అయిందని అసలు విషయాన్ని ప్రకటించేసింది.

Advertisement

Also Read :  విక్రమ్ ‘తంగలాన్’ మరో అపరిచితుడు అవుతుందా ?

మే 31న మా నిశ్చితార్థం జరిగింది. జూన్ 12న పెళ్లి చేసుకున్నాం. అనివార్య కారణాల వల్ల కొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. పెద్దగా ఎవరికి ఆహ్వానం పంపలేదని పూర్ణం తెలియజేశారు. పలు కారణాల వల్ల ఇండియాలో ఉన్న సన్నిహితులు మిత్రులు బంధువులు రాలేకపోవడంతో వారి కోసం కేరళలో ఇక రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. పూర్ణ ఇచ్చిన సడన్ షాక్ నుంచి ఆమె అభిమానులు ఇంకా తీరుకోలేదు. పూర్ణ లైఫ్ గమనిస్తే ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆమె గతంలో మాదిరే ఉంటున్నారు. ఇటీవల ‘అఖండ’ చిత్రంలో కీలకపాత్ర పోషించి మెప్పించింది పూర్ణ.

Also Read :  డీజే టిల్లు సీక్వెల్ అప్డేట్ వచ్చేసింది.. టైటిల్ ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading