Home » SLBC ప్రాజెక్ట్ కోమ‌టిరెడ్డి క‌ల‌.. అది ఎప్పుడు నేర‌వేరేనో..!

SLBC ప్రాజెక్ట్ కోమ‌టిరెడ్డి క‌ల‌.. అది ఎప్పుడు నేర‌వేరేనో..!

by Anji
Ad

తెలంగాణ రాష్ట్రంలో కోటి గొంతుల దాహం తీర్చాల‌ని, ల‌క్ష‌ల ఎక‌రాల‌ను ప‌చ్చ‌ద‌నంగా త‌యారు చేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏనాడో భావించింది. న‌ల్ల‌గొండ మాజీ ఎమ్మెల్యే, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి SLBC ప్రాజెక్ట్ పూర్తి కావాల‌ని కోరుతున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు కంటే ముందే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కి శంకుస్థాపన చేశారు. కానీ అది పాల‌కుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా అమ‌లుకు నోచుకోవ‌డం లేద‌నే చెప్ప‌వ‌చ్చు.

Also Read : 1999 బాలకృష్ణ, చిరంజీవి సునామి లో కొట్టుకుపోయిన టాలీవుడ్ సినిమాలు ఇవే!

Advertisement

SLBC Project irrigation project located in Nalgonda district

SLBC Project irrigation project located in Nalgonda district

తెలంగాణ సామాన్య ప్రజలుగా నల్లగొండ బిడ్డలుగా ఈ రెండు ప్రాజెక్టులో ఏది కావాలి. నిరంతరం ఫ్లోరైడ్ కోరల్లో నలిగిన నల్లగొండకు దక్కాల్సిన కృష్ణ నీటి బాట రూటు మారుతుంది. నల్గొండ కరువు పోగొడుతుంది అన్న SLBC ప్రాజెక్టు పై కుట్ర జరుగుతుంది. కాంట్రాక్టుల పొట్ట నింపే కాళేశ్వరానికి లక్షల కోట్లు విచ్చేస్తున్న ప్రభుత్వం. లక్షల ఎకరాలకు నీటిని, కోటి గొంతుల దప్పిక తీర్చే ఎస్ఎల్బీసీ ని మాత్రం కావాలనే ఎండగడుతుంది. ఇంతకు నల్లగొండ ను సుభిక్షంగా మార్చే SLBC ఐడియా ఎవరిది? నల్గొండ జిల్లాలోని కరువు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీరు మొదటి లక్ష్యం. దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగు నీరు రెండో లక్ష్యం. అపర భగీరథుడు అప్పటి జిల్లా మంత్రి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి వైయస్సార్ వెంటబడి మరి ఓకే చేయించిన ప్రాజెక్టు SLBC.

Advertisement

ఒక్క మాట చెప్పాలంటే అప్పట్లో MP వెంక‌ట్‌రెడ్డి గారి కల‌. అప్పట్లో దేశంలోనే అతి పెద్దదైన స్వరంగం మార్గం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును 1925 కోట్లతో 5 ఏళ్లలో పూర్తి చేయాలనేది టార్గెట్. 2007 నుంచి 2013 వరకు 850 కోట్లకు పైగా ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు అయ్యాయి. దీనివెనక అడుగడుగున వెంకన్న ప్రోద్బలం ఉంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పడకేశాయి. దురదృష్టం ఏంటంటే 44 కిలోమీటర్ల సొరంగ మార్గానికి 34 కిలోమీటర్లు తవ్వేశారు. మిగిలింది ఇంకా కేవ‌లం 10 కిలోమీటర్లే. అయినా సర్కారు వారికి దయ రాలేదు. 2019, 2020లో SLBC కి కేటాయించిన బడ్జెట్ రూ.3 కోట్లు 2020, 21 లో కూడా అవే మూడు కోట్లు.

Also Read : కొత్తిమీర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు..!

SLBC Project irrigation project located in Nalgonda district

ప్ర‌భుత్వం కేటాయించిన బ‌డ్జెట్ నిర్వహణ వేయడానికి కూడా సరిపోదు. ఇక ఇవి చాలు నల్గొండ ప్రజల పట్ల కేసీఆర్ ప్రేమ ఎంత ఉందో చెప్పడానికి. కానీ ఈ ప్రాజెక్ట్ కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి క‌ల అందుకే కేసీఆర్ తో పోరాటం సాగించాడు. కేసీఆర్ సర్కార్ కి లేఖల మీద లేఖలు, నత్తనడకన మీద పనిచేసే సంస్థలు తగ్గించాలంటూ ఫిర్యాదులు. SLBC కి రెండు వేల కోట్లు ఇవ్వండి చాలు. 4 వేల క్యూసెక్కుల నీరు నల్గొండ దప్పికను తీరుస్తుందని గొంతు నొప్పి పుట్టేలా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు కేసీఆర్ సర్కార్ ముందు గోషించాడు.

 

తెలంగాణ ప్ర‌భుత్వం ఏం చేసిందంటే.. జీవో నెంబర్ 246 తో నల్గొండ ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్ర‌త‌య్నం చేస్తోంది. న‌ల్ల‌గొండ‌కు దక్కాల్సిన 45 టీఎంసీ ల నీటిని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కు కేటాయించింది. రెండు జిల్లాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసింది. అందుకే ఈ దుర్మార్గం జీవోను రద్దు చేయాలని సమర శంఖం పూరించారు కోమటిరెడ్డి. దీక్షను హెచ్చరించారు. పనికిరాని ప్రాజెక్టుల లో లక్షల కోట్ల అవినీతిని సహించాం. ప్రాణం నిలిపే ప్రాజెక్టుకు 2 వేల కోట్లు ఆపారు ఇక సహించం అంటూ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి పేర్కొంటున్నారు.

Also Read : శ్రీదేవి త‌న‌కు గురువు అని చెప్పుకున్న ఎన్టీఆర్..! ఆయ‌న ఎందుకు అలా అనేవారో తెలుసా..?

 

Visitors Are Also Reading