దక్షిణాది హీరోయిన్లలో త్రిష ఒకరు. ముఖ్యంగా నాలుగు పదుల వయసు ఉన్నప్పటికీ ఆమెలో వన్నె ఏమాత్రం తగ్గని అందం ఆమెది. తాజాగా పొన్నియన్ సెల్వన్ లో త్రిష అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో త్రిషకు ఇటు తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీకి బాలయ్య సినిమాలో మరోసారి నటించే ఛాన్స్ వచ్చింది. త్రిష 20 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసింది.అయినప్పటికీ త్రిష వరుసగా ఆఫర్లు అందుకుంటూ బిజీగా ఉంది.
Also Read : సినిమాల్లో నటించాలంటే సభ్యత్వం ఉండాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చిన మంచు విష్ణు..!!
Advertisement
ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్ 1’ తెలుగులో ఆడలేదు. కానీ తమిళంలో మాత్రం అతి పెద్ద హిట్ గా నిలిచింది. అనేక సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. ఆ సినిమా విజయంతో త్రిషకి మళ్ళీ క్రేజ్ పెరిగిపోయింది. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తీస్తున్న సినిమాలో ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఫైనల్ కాలేదు. బాలకృష్ణ కూతురు గా శ్రీలీల నటిస్తోంది. హీరోయిన్ విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అయితే ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది.ఈ తరుణంలో బాలయ్య, అనిల్ రావిపూడి టీమ్ త్రిషను కూడా సంప్రదించినట్టు సమాచారం.ఆమెకు కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ నడుస్తోంది.
Advertisement
ప్రస్తుతం ఆమె రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య ‘108’ లో నటించేందుకు త్రిష ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. ఇటీవలే విడుదలైన పొన్నియన్ సెల్వన్ లో కూడా త్రిష రెమ్యూనరేషన్ పై టాక్ వచ్చింది. ఐశ్వర్య రాయ్ రాణి నందినిగా నటించగా.. చోళ యువరాణి కుందనై పిరిత్తియార్ పాత్రలో త్రిష నటించింది. ఈ పాత్ర కోసం త్రిష 2.5 కోట్లు తీసుకుందని సమాచారం. తాజాగా బాలయ్య సినిమా కోసం కూడా.. త్రిష కోటి రూపాయలు అడగడంతో అందుకు నిర్మాతలు ఓకే చెప్పారట. దీంతో బాలయ్య సినిమాలో త్రిష ఫిక్స్ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. 2015 లో వచ్చిన బాలయ్య సినిమా లయన్ లో కూడా త్రిష నటించింది. ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ సినిమా ఎలాంటి హిట్ సాధిస్తుందో వేచి చూడాలి మరి.
Also Read : ఆ ఓటిటీ చేతికి “యశోద” డిజిటల్ రైట్స్ !