Home » బాలయ్య సినిమాకు భారీగా డిమాండ్ చేస్తున్న త్రిష..!

బాలయ్య సినిమాకు భారీగా డిమాండ్ చేస్తున్న త్రిష..!

by Azhar
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు అనే విషయం తెలిసిందే. ఆయన నుండి చివరగా వచ్చిన అఖండ సినిమా పేరుకు తగ్గిన విధంగా అఖండ విజయం సాధించడంతో.. ఆయన నుండి తర్వాత రాబోతున్న సినిమా గురించి ఫ్యాన్స్ చాల ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం బాలయ్య.. క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

అయితే ఈ సినిమాలో సీనియర్ హీరో అయిన బాలయ్యకు జోడిగా శృతి హాసన్ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనీ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య కేరియర్ లో 108వ సినిమా అనేది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది.

Advertisement

ఇక బాలయ్యతో ఈ సినిమాలో ఎవరు జోడిగా నటిస్తారు అనే ఆలోచన అందరికి వచ్చింది. ఎందుకంటే.. బాలయ్య, చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలకు హీరోయిన్ దొరకడం ఇప్పుడు కాస్త కష్టం అయ్యింది అనేది అందరికి తెలిసందే. అయిన ఈ సినిమాకు మంచి హీరోయిన్ ను పట్టుకున్నారు నిర్మాతలు. ఇందులో బాలయ్యకు జంటగా త్రిషను తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.. కానీ ఈ సినిమా కోసం ఆమె కోటి రెమ్యూనరేషన్ అనేది డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

గంగూలీని దెబ్బ కొట్టింది సీఎస్కే ఓనరా…?

కరోనా పాజిటివ్ తో కూడా మ్యాచ్ ఆడొచ్చు అంటున్న ఐసీసీ..!

Visitors Are Also Reading