Home » నాగ‌చైత‌న్య సినిమా టైటిల్ ఏంటో తెలుసా ?

నాగ‌చైత‌న్య సినిమా టైటిల్ ఏంటో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ముఖ్యంగా నాగ‌చైత‌న్య స‌మంతతో విడాకులు తీసుకున్న త‌రువాత వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్నాడు. తాజాగా నాగ‌చైత‌న్య‌ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్ర న‌టిస్తున్నాడు. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కూడా వ‌చ్చింది.

Also Read : భార్య‌తో విడాకులకు రెడీ అవుతున్న‌ బిచ్చ‌గాడు హీరో..? కార‌ణం అదేనా..?

Advertisement

ఈ చిత్రానికి ‘302’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అవుతుందని టాక్ కూడా బలంగానే వినిపిస్తుంది. చై పాత్ర.. స్టోరి ఆధారంగా చేసుకుని ఈ టైటిల్ నిర్ణయించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ కథలో చాలా ట్విస్టులు ఉంటాయట‌. చైతూ రోల్.. స్టోరీని డీకోడ్ చేసే 302 అనే టైటిల్ కి బలమైన ఇండికేషన్ అని అంటున్నారు. చైతన్యది పోలీస్ ఆఫీసర్ రోల్ అయినా యూనిఫాంలో కనిపించేది చాలా తక్కువ సన్నివేశాల్లోనేనని.. మెజార్టీ పార్ట్ కాంబినేషన్స్ సీన్స్ ఎక్కువగా గ్యాంగ్ స్టర్లతోనే ఉంటాయని యూనిట్ వర్గాల నుంచి లీకులు అందుతున్నాయి.

Advertisement

Also Read : రాజమౌళి, కోడి రామకృష్ణ చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అని తెలుసా..?

ప్రియమణి రోల్ కూడా పోటా పోటీగా కొన‌సాగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సైట్స్ లో ఉంది. చైతన్య పై కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇందులో నాగచైతన్య కి జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. ఈ యంగ్ బ్యూటీ నాగచైతన్య తో తెరను పంచుకోవడం ఇది రెండవసారి. ఇప్పటికే బంగార్రాజు లో చైతో రొమాన్స్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే మరో ఛాన్స్ అందుకుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. వెంకట్ ప్రభు డైరెక్టర్ కావడంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. కచ్చితంగా నాగచైతన్య కెరీర్లో ఇదో మైల్డ్ స్టోన్ నిలిచిపోవడం ఖాయమట. ఈ సినిమా ఎలాంటి ఫ‌లితం అందిస్తుందో వేచి చూడాలి.

Also Read : బాహుబ‌లి సినిమాలో అవ‌కాశం వ‌చ్చినా మంచుల‌క్ష్మి ఎందుకు వ‌దులుకుందో తెలుసా ?

 

Visitors Are Also Reading