ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ సినిమా కూడా ఒక్కటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు అనేది తెలిసిందే. అలాగే సీత పాత్రలో కృతి సనాన్ నటిస్తుంది. ఇక ఈ మధ్యే ఈ సినిమా టీజర్ అనేది విడుదల చేసారు. కానీ అది జనాలకు అంతగా నచ్చలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి మరో అప్డేట్ అనేది బయటికి వచ్చింది.
ఆదిపురుష్ సినిమాలో ఉన్న పాటల గురించి ఓ చర్చ అనేది నడుస్తుంది. అయితే ఆది ఆదిపురుష్ సినిమాలో మొత్తం 3 పాటలు అనేవి ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా సంగీతం అందిస్తున్న అజయ్ అతుల్.. ఆ పాటలను అదరగొట్టాడు అని తెలుస్తుంది. ఇక ఈ మూడు పాటలు ఎక్కడ వస్తాయో కూడా ట్రెండ్ అవుతుంది.
ఆదిపురుష్ సినిమాలోని జై శ్రీరామ్ అనే ఓ పాట ఇప్పటికే టీజర్ లోనే ఉంది. ఈ పాట అనేది సినిమా మొత్తం కీలక సన్నివేశాల్లో వస్తుంది అని తెలుస్తుంది. అలాగే మరో అద్భుతమైన పాట అనేది రాముడు, సీత కలుసుకున్న సమయంలో వస్తుంది అని సమాచారం. టీజర్ లో కనిపించిన ఆ ఉయ్యాలా సన్నివేశం ఆ పాటలోనిదే అని తెలుస్తుంది. ఇక మూడో పాట కేవలం ప్రమోషన్స్ కోసమే అన్ని.. అది సినిమా పూర్తి అయిన తర్వాత చివర్లో వస్తుంది అని అంటున్నారు.
ఇవి కూడా చదవండి :