Ad
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు థమన్. 2020 వరకు థమన్, దేవి శ్రీ ప్రసాద్ మధ్యలో పోటీ అనేది బాగా ఉండేది. కానీ ఆ ఏడాది వచ్చిన అలా వైకుంఠపురములో అనే సినిమాతో థమన్ టాప్ ప్లేస్ లోకి వెళ్ళిపోయాడు. అంతే కాకుండా అప్పటి నుండి థమన్ చేస్తున్న ప్రతి సినిమాలో కూడా మ్యూజిక్ అనేది సూపర్ హిట్ అవుతుంది.
అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రతి సినిమా కూడా థమన్ వద్దకే వెళ్తుంది. అందులో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా ఉంది. అయితే ఈ సినిమాకు ముందు వరకు ఒక్కో సినిమాకు రెండు కోట్ల రెమ్యునరేషన్ అనేది తీసుకునే థమన్.. మహేష్ సినిమా కోసం 4 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిస్తుంది.
కానీ దీనిని ఒక్క మహేష్ సినిమా వరకే పరిమితం చేయలేదు థమన్. ఇక నుండి తాను చేసే ప్రతి సినిమాకు కూడా అదే రేంజ్ లో వసూల్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగానే తాజాగా రామ్ పోతినేని, మాస డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకే కూడా మ్యూజిక్ అందిస్తున్న థమన్.. అదే రేంజ్ లో పారితోషకం అనేది అడిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలు హిట్ అయితే థమన్ రెమ్యునరేషన్ అనేది ఇంకా పెరిగే అవకాశాలు అనేవి బాగానే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
సంజూ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టగలడు..!
హైదరాబాద్ జట్టులో సిరాజ్.. కానీ ఆడటం అనుమానమే..!
Advertisement