మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ అంటే అప్పట్లో ఓ క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. చిరంజీవి టాలీవుడ్ కు మెగాస్టార్ అయితే శ్రీదేవి చిత్రపరిశ్రమలోనే అందాల తారగా రాణించింది. ఇద్దరూ కలిసి జోష్ తో స్టెప్పులు వేస్తే ఫ్యాన్స్ కు పండగే. ఇదిలా ఉండగా వీరిద్దరూ కాంబినేషన్ లో రావాల్సిన కొన్ని సినిమాలు కూడా ఆగిపోయాయి. ఆ సినిమా లు కనక వచ్చి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయడుతుంటారు.
Also Read: ఐశ్వర్యతో విడాకులు తీసుకోకముందే రెండో పెళ్లి గురించి ఆలోచిస్తున్న అభిషేక్ బచ్చన్.. వైరల్ అవుతున్న ట్వీట్…!
Advertisement
ఇక వీరిద్దరి కాంబినేషన్ లోనే ఓ బ్యూటిఫుల్ ప్రేమకథా చిత్రం కూడా మిస్ అయ్యింది. ఆ సినిమా ఏంటి..? ఎందుకు ఆ సినిమా మిస్ అయ్యింది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం…..అప్పట్లో అశోక్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్యూటిఫుల్ ప్రేమకథా చిత్రం అభినందన. ఈ సినిమాకు జి.బాబు కథను అందించారు. ఆత్రేయ అందించిన పాటలు ఈ సినిమాకు ప్రాణం పోశాయి. మంచుకురిసే వేళలో అనే పాట శ్రోతల మనసు దోచుకుంది.
Advertisement
ఇప్పటికీ ఆ పాటకు అభిమానులు ఉన్నారు. ఇక ఈ సినిమాకు కథ రాయడం తో పాటూ జి బాబునే నిర్మించారు కూడా. అయితే కథ పూర్తయిన తరవాత ఆయన మొదట చిరంజీవి, శ్రీదేవి లతో ఈ సినిమాను చేయాలని అనుకున్నారట. అంతే కాకుండా సినిమా కథను శ్రీదేవికి వినిపించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆ తరవాత చిరంజీవి మేనేజర్ కు కథ చెప్పగా ఆయన ఇది ఓల్డ్ లవ్ స్టోరి అంటూ రిజెక్ట్ చేశారు. దాంతో ఇదే కథతో అన్వేషణ సినిమా హీరో కార్తీక్ మరియు శోభనను హీరోహీరోయిన్ లుగా తీసుకుని తెరకెక్కించారు. అలా తెరెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ALso Read: గడ్డం తీసుకావాలని చెబితే “బొంబాయి” సినిమానే వదులుకున్నాడు….ఆ స్టార్ హీరో ఎవరంటే…?