ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది. యూనివర్సిటీ పేరు మార్చుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు.. అభిమానులు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు ఈ వివాదం పై స్పందిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ స్పందించగా.. తాజాగా టాలీవుడ్ టాప్ దర్శకుడు రాఘవేంద్రరావు ట్విట్టర్ వేదిగా తమ నిర్ణయాన్ని చెప్పారు.
Advertisement
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానీయుడు అన్న నందమూరి తారకరామారావు అని తెలిపారు. ఎన్టీఆర్ పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గు పడుతోందని, కన్నీరు పెడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Also Read : ప్రభాకర్ కొడుకుపై దారుణంగా ట్రోలింగ్.. ఎందుకంటే..?
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతోంది, కన్నీరు పెడుతోంది.
— Raghavendra Rao K (@Ragavendraraoba) September 24, 2022
ఇక ఈ విషయంపై టీడీపీ శ్రేణులు, పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నందమూరి కుటుంబం నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నారా రోహిత్ వంటి వారు తమదైన శైలిలో కౌంటర్లు వేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ చాలా తెలివిగా మాట్లాడుతూ ట్వీట్ చేసిన విషయంపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగడం విశేషం.
Also Read : ALLURI MOVIE REVIW & RATING : అల్లూరి సినిమా రివ్యూ..! శ్రీవిష్ణుకు మాస్ హిట్ పడినట్టేనా..?