ఐటీ శాఖలో 83 మంది చీఫ్ కమీషనర్ స్థాయి అధికారుల బదిలీలు జరిగాయి. 155 మంది ప్రిన్సిపల్ కమీషనర్ స్థాయి అధికారుల బదిలీ జరగ్గా ఐటీ శాఖ చరిత్రలో భారీ బదిలీలు జరగటం ఇదే మొదటి సారి. హైదరాబాద్ ఐటీ ఇన్వెస్టిగేషన్ డీజీ గా సంజయ్ బహదూర్ ను…. విజయవాడ ఐటీ చీఫ్ గా శ్రీపాద రాధాకృష్ణ.. హైదరాబాద్ ఐటీ చీఫ్ గా శిశిర్ అగర్వాల్ ను నియమించారు.
GHMC కౌన్సిల్ సమావేశానికి 43మంది BJP కార్పొరేటర్లు నల్లబ్యాడ్జి లతో వచ్చారు ఎమ్మెల్యే రాజాసింగ్ ను విడుదల చేయాలని ప్లకార్డులు పట్టుకుని సమావేశానికి వచ్చారు.
Advertisement
ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రూ,800 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని GHMC ప్రధాన కార్యాలయం ముట్టడికి కాంట్రాక్టర్లు బయలు దేరారు. పోలీసులకు, కాంట్రాక్టర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా భారీగా పోలీసులు మోహరించారు.
కామారెడ్డిలోని పాలవాగు ఉధృతితో కారు వాగులో చిక్కుకుకుంది. గ్రామస్థులు తాడుతో కట్టి కారుని ఒడ్డుకు చేర్చారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.
Advertisement
దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. భారత్ లో కొత్తగా 4043 కరోనా కేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు 1.37 శాతంగా ఉంది.
విశాఖపట్నంలో ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి భారీగా ఎక్విప్ మెంట్, సెల్ ఫోన్స్,నగదు స్వాధీనం చేసుకున్నారు.
నేటితో రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు 12 రోజుల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగింది.
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ లో చేరారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని అమరీందర్ సింగ్ బీజేపీ లో విలీనం చేశారు.
తెలంగాణలో ఈనెల 25 నుంచి అక్టోబర్ 3 వరకు బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ ఘనంగా బతుకమ్మ పండగ నిర్వహించనున్నారు. అక్టోబర్ 3న ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ ఉత్సవాల కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.