Home » పవన్ కళ్యాణ్ అభిమానించే అలనాటి స్టార్ హీరో ఎవరో తెలుసా ? అస్సలు నమ్మ లేరు !

పవన్ కళ్యాణ్ అభిమానించే అలనాటి స్టార్ హీరో ఎవరో తెలుసా ? అస్సలు నమ్మ లేరు !

by AJAY

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పేరు అనే కంటే ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ తమ్ముడు గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఎవరైనా హీరోకు మూడు కు మించి ఫ్లాప్ లు పడ్డాయంటే కెరీర్ ముగిసినట్టే….కానీ పవన్ కు కొన్నేళ్ళు సరైన హిట్ పడలేదు. అయినప్పటికీ స్టార్ స్టేటస్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక తెలుగు ప్రేక్షకుల్లో చాలా మంది పవన్ ను అభిమానించేవాళ్ళు ఉన్నారు.

Also Read: హీరోయిన్ రాశి గుండెలు పిండేసే లవ్ స్టోరీ వెనుక రహస్యం.. కోటీశ్వరులకు నో చెప్పి ఆయనతోనే..!!

పవన్ సినిమాల తో పాటు ఆయన వ్యక్తిత్వాన్ని సైతం చాలా ఇష్టపడతారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఏకంగా దేవుడిలా కొలుస్తారు. ఇక అభిమానులు అంతలా ప్రేమించే పవన్ కు ఒక నటుడు అంటే చాలా ఇష్టమట. అయితే ఆయన ఈ తరానికి చెందిన నటుడు కాదు. ఒక్కప్పటి గొప్ప హాస్యనటుడు చలం. పవన్ చలం ను ప్రేరణ గా తీసుకున్నారట.

హాస్యరసానికి చలం హీరోయిజం ను పరిచయం చేశారు. కాగా ఓ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ తాను చలం ను కొన్ని సందర్భాల్లో ఇమిటేట్ చేశానని చెప్పారు. 100 కు పైగా సినిమాల్లో నటించిన చలం తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

Also Read: నా భర్త మగాడు కాదని కేసు పెట్టిన మహిళ… ఇందులో అసలు ట్విస్టు ఏంటంటే..?

సినిమాల్లో రాణించిన చలం నిజ జీవితం లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నిర్మాత గా మారి చలం తీసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడం తో నష్టపోయారు. నటి శారద తో చలం కొన్నేళ్ళు సహజీవనం చేశారు. కానీ ఆ తరవాత శారద తో విభేదాలు వచ్చి విడిపోయారు. ప్రేమ విఫలం అవ్వడం తో చలం డిప్రెషన్ లో కి వెళ్ళి మద్యానికి బానిసయ్యాడు. చివరికి దిక్కులేని స్థితిలో మరణించారు.

Visitors Are Also Reading