Home » పాయ‌ల్ ప‌రువు తీసిన మంచు విష్ణు.. ఎందుకో తెలుసా..?

పాయ‌ల్ ప‌రువు తీసిన మంచు విష్ణు.. ఎందుకో తెలుసా..?

by Anji
Ad

మంచు విష్ణు ఈ మ‌ధ్య‌కాలంలో ఎంత‌గా ట్రోలింగ్‌కి గుర‌వుతున్నాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆ ట్రోలింగ్ ను మాత్రం విష్ణు అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా, ఏ అంశం మీద స్పందిచినా, ఫోటోను షేర్ చేసినా కూడా నెటిజ‌న్లు ఆడేసుకుంటున్నారు. ముఖ్యంగా మా ఎన్నికల స‌మ‌యం నుంచి విష్ణు నెట్టింట్లో ఎప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. తాజాగా మంచు విష్ణు సోష‌ల్ మీడియాలో ఓ ట్రోలింగ్ మెటీరియ‌ల్ లా చూస్తుంది. మంచు విష్ణు మాత్రం అంద‌రితో ఎంతో స‌ర‌దాగా ఉంటారు. సెట్‌లో అంద‌రినీ న‌వ్విస్తుంటాడు. అంద‌రితో క‌లిసి పోతుంటాడు.

Advertisement

మంచు విష్ణు గ‌త కొద్ది రోజులుగా జిన్నా సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌తీ అప్‌డేట్ అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. జిన్నా టైటిల్ ప్ర‌క‌ట‌న విష‌యంలోనే ఎంతో కాంట్ర‌వ‌ర్సీ ఏర్ప‌డింది. తిరుమ‌ల కొండ బ్యాక్ గ్రౌండ్‌లో ఉండ‌డం జిన్నా అనేపేరు పెట్ట‌డంతో కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ అయింది. అయితే జిన్నా షార్ట్ నేమ్ అని అస‌లు పేరు వేరే ఉంటుంద‌ని నిర్మాత‌లు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఆ కాంట్ర‌వ‌ర్సిలో జిన్నా సినిమా ఒక్క‌సారిగా హాట్ టాపిక్ అయింది. జిన్నా సినిమాలో స‌న్నీ లియోన్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ లు న‌టించ‌డంతో అంద‌రి క‌ళ్లు ప‌డ్డాయి. స‌న్నీ లియోన్ ఇది వ‌ర‌కు మంచు మ‌నోజ్ క‌రెంట్ తీగ సినిమాలో స్పెష‌ల్ రోల్ చేసింది. ఇప్పుడు మంచు విష్ణు జిన్నా చిత్రంలో ఓ లెంగ్తీ రోల్ చేస్తుంది. జిన్నా సెట్‌లో స‌న్నీ లియోన్ పాయ‌ల్‌తో మంచు విష్ణు చేస్తున్న సందడికీ సంబంధించిన వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

Also Read :  హీరోల భార్య‌ల్లో ఆమెకు క్రేజ్ మామూలుగా లేదుగా..!

పాయ‌ల్ సన్నీల‌తో క‌లిసి మంచు విష్ణు చేసిన రీల్ వీడియోలు ఆ ఇద్ద‌రూ క‌లిసి మంచు విష్ణును స‌ర‌దాగా కొట్టిన వీడియోలు ఇలా ఎన్నో వైర‌ల్ అయ్యాయి. ఈ ముగ్గురు క‌లిసి చేసిన రీల్ వీడియోలు మంచు విష్ణు చెప్పిన వంట చిట్కాలు ఇలా అన్ని కూడా నెట్టింట్లో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. ఈ ముగ్గురూ క‌లిసి చేసిన సంద‌డి, వీడియోల‌తో జిన్నా సినిమా కూడా ప్ర‌మోట్ అయింది. తొలుత స‌న్నీ లియోన్ ని తీసుకోకూడ‌ద‌ని మంచు విష్ణు అనుకున్నాడ‌ట‌. అంద‌రూ స‌జెస్ట్ చేయ‌డం, మీడియా మిత్రులు కూడా ఓకే అన‌డంతో ఆ పాత్ర‌కు స‌న్ని లియోన్ ని తీసుకున్న‌ట్టు చెప్పుకొచ్చాడు. మొత్తానికి జిన్నా సినిమాను మాత్రం విష్ణు భారీగానే ప్ర‌మోట్ చేస్తున్నాడు. వ‌చ్చే నెల‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Also Read :  హీరోల భార్య‌ల్లో ఆమెకు క్రేజ్ మామూలుగా లేదుగా..!

Visitors Are Also Reading