సాధారణంగా సినిమా హీరోల భార్యలు అంటే సహజంగానే ఫుల్ క్రేజ్ ఉంటుంది. కొందరు హీరోలు ఇండస్ట్రీలోని అమ్మాయిలనే పెళ్లి చేసుకుంటారు. మరికొందరు సమీప బంధువుల అమ్మాయిని, కొందరు లవ్ స్టోరీలు ఉంటాయి. ఇలా రకరకాలుగా పెళ్లిళ్లు చేసుకుంటారు. ప్రధానంగా హీరోలు, హీరోయిన్లను పెళ్లి చేసుకుంటే ఆ జంట పై చాలా క్రేజ్ వాతావరణం ఉంటుంది. రాజకీయల నేతల ఇంటి అమ్మాయిలను హీరోలు పెళ్లి చేసుకున్నా లేదా వ్యాపార రంగంలో ఫేమస్ అయిన వారి ఇంటి పిల్లను పెళ్లి చేసుకున్నా వారు కూడా వార్తల్లో నిలుస్తుంటారు.
Advertisement
ఇలాంటి భారీ నేపథ్యం లేకపోయినా హీరో భార్యగా గుర్తింపు పొందిన అనంతరం సొంతంగా వెలిగే వాళ్లు మాత్రం చాలా అరుదు. హీరో భార్యగా వచ్చిన గుర్తింపు కన్నా ఆ హీరోనే ఆమె భర్త అనేంత సందర్భాలు చాలా తక్కువ. హృతిక్ రోషన్ భార్య సుసాన్ కి ఇలాంటి గుర్తింపు ఉండేది. ఆమెది కాస్త సినీ నేపథ్యమే. ఆమె తండ్రి నటుడు, దర్శకుడు. ఆ సినీ గుర్తింపు కన్నా హృతిక్ భార్యగా ఆమెకు ఎక్కువ గుర్తింపును ఇచ్చింది. హృతిక్ విడాకుల అనంతరం కూడా సుసాన్ తెర మరుగు కాలేదు. సొంతంగా కూడా సుసాన్ కు మంచి గుర్తింపు ఉంది. దాన్ని ఆమె కమర్షియల్ గా వాడుకునే ప్రయత్నాలు చేయలేదు.కానీ సుసాన్ ప్రత్యేకమే అని చెప్పాలి. కరీనా కపూర్, విద్యాబాలన్ వంటి వాళ్లతో వ్యవహారాలు సాగించాడనే పేరు ఉన్న షాహిద్ కపూర్ ని వారి విషయంలో ఏమో కానీ అతడి భార్యను చూసి జలాసీలు ఉంటాయి. మీరా రాజ్ పుత్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు షాహిద్.
Advertisement
Also Read : ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా..!
అప్పటి నుంచి హీరోగా అతని కెరీర్ పీక్ స్టేజీకి చేరింది. సినీ నేపథ్యం లేని అమ్మాయిలు ఎవరైనా బాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకున్నాక మీరా రేంజ్‌లో అందరి దృష్టిని ఆకర్షించడం గత దశాబ్దాల్లోనే జరిగి ఉండదు. మీరా రాజ్‌పుత్ అంటే బాలీవుడ్ హీరోయిన్లకు మించిన క్రేజ్ ఉంటుంది మీడియాలో.. ముఖ్యంగా ఆమె గురించి రాయడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. యాడ్ మార్కెట్‌లో కూడా మీరాకు అవకాశాలు దక్కుతున్నాయి. ఆమె చేత రకరకాల యాడ్స్ చేయిస్తున్నారు.
బ్యూటీ ప్రోడక్స్ట్ యాడ్స్ తో పాటు టీవీల యాడ్ లో కూడా మీరా ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇలా బ్రాండ్ ప్రమోటర్ స్థాయికి ఎదిగిన హీరోల భార్యలు ఎవ్వరూ లేరేమో.. ఏ హీరోయిన్ హీరోని పెళ్లి చేసుకుని తమ బ్రాండ్ వ్యాల్యూను పెంచుకుని ఉండవచ్చు. సినీ నేపథ్యం లేకుండా హీరో భార్యగా మారి ఓన్ క్రేజ్‌ని సంపాదించుకున్న వారిలో మీరానే సో స్పెషల్ అని చెప్పవచ్చు.
Also Read : నయన్ అన్ని కోట్ల ఆస్తులు సంపాదించిందా..? ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటుందంటే..?