Home » పిల్ల‌లు త‌ప్పు చేస్తున్నార‌ని శిక్షిస్తున్నారా..? అలా కాకుండా ఇలా చేసి చూడండి..!

పిల్ల‌లు త‌ప్పు చేస్తున్నార‌ని శిక్షిస్తున్నారా..? అలా కాకుండా ఇలా చేసి చూడండి..!

by Anji
Ad

పిల్ల‌ల‌కు మంచి న‌డ‌వ‌డిక‌, విలువ‌లు నేర్పించ‌డం త‌ల్లిదండ్రుల బాధ్య‌త‌. ఈ క్ర‌మంలో చాలా మంది త‌ల్లిదండ్రులు పిల్ల‌ల ప‌ట్ల ప‌లు సంద‌ర్భాల్లో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ నిమిషంలో పిల్ల‌లు భ‌య‌ప‌డ‌డం, మార‌డం చేయ‌వ‌చ్చేమో కానీ అది వారిలో ద్వేషాన్ని నింపుతుంది. అందుకోసం పిల్ల‌లు త‌ప్పు చేసిన‌ప్పుడు త‌ల్లిదండ్రులు క‌ఠినంగా ఉండి శిక్షించ‌డం క‌న్నా ఇలా చేస్తే వారు త‌ప్పుల విలువ‌ల‌ను తెలుసుకోవ‌డమే కాకుండా తల్లిదండ్రుల‌పై గౌర‌వం పెరుగుతుందంటున్నారు నిపుణులు.


పిల్ల‌లు ఏదైనా త‌ప్పు చేసిన‌ప్పుడు వెంట‌నే అర‌వ‌డం, కొట్ట‌డం వంటివి చేయ‌కూడ‌దు. స‌హ‌నంగా ఉండాలి. పిల్ల‌ల‌ను ప‌క్క‌కు తీసుకొచ్చి వారు ఏం త‌ప్పు చేశారో వివ‌రించి దాని వ‌ల్ల క‌లిగే ప‌రిణామాల గురించి వారు ఆలోచించ‌డానికి స‌మ‌యం ఇవ్వాలి. పిల్ల‌లు మాట్లాడుతుంటే చాలా మంది త‌ల్లిదండ్రులు కామ్‌గా ఉండు అని కోప‌గించుకుంటారు. మ‌రికొంద‌రు పిల్ల‌లు తెలిసి తెలియ‌క పెద్ద‌వారు మాట్లాడే మాట‌లు మాట్లాడితే వెంట‌నే శిక్షించ‌డానికి రెడీ అవుతుంటారు. కానీ అలా చేయ‌కూడ‌దు. దానికి బ‌దులుగా పిల్ల‌లు చెప్పే మాట‌లు వినాలి. త‌ప్పుగా మాట్లాడితే ఎందుకు అలా మాట్లాడుతున్నారో, ఎక్క‌డ విన్నారో తెలుసుకోవాలి. పిల్ల‌ల‌తో మాటల్లో దొర్లే త‌ప్పుల గురించి చెప్పి.. ఎందుకు అలా మాట్లాడ‌కూడ‌దో వివ‌రించాలి.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి : భార్య‌, భ‌ర్త‌లు పిల్ల‌ల ముందే గొడ‌వ ప‌డుతున్నారా..? అయితే ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి.! 


అంతేకాదు దీనివ‌ల్ల పిల్ల‌లు ఏ విష‌యాల ప‌ట్ల ఆస‌క్తిగా ఉన్నారో తెలుస్తుంది అంటున్నారు నిపుణులు. మంచిని ప్ర‌శంసించండి. పిల్ల‌లు త‌ప్పు చేస్తే దానిని ఎత్తి చూపి వాటి గురించి వివ‌రించాలి. అదేవిధంగా పిల్ల‌లు చేసే మంచి ప‌నుల‌ను ప్ర‌శంసించ‌డం కూడా చేయాలి. వారి మంచి ప్ర‌వ‌ర్త‌న‌, న‌డ‌వ‌డిక‌ను మెచ్చుకోవాలి. ఈ విధంగా చేయ‌డం ద్వారా పిల్ల‌ల‌కు మంచి, చెడుల మ‌ధ్య వ్య‌త్యాసం దాని వ‌ల్ల ప‌రిణామాలు అర్థ‌మ‌వుతాయి. వాస్త‌వ ప‌రిస్థితుల‌ను వివ‌రించాలి. పిల్ల‌ల‌కు చిన్న‌త‌నం నుంచే ఏది వాస్త‌వ‌మో.. కాదో వివ‌రించాలి. ముఖ్యంగా టీవీల్లో చూపించే ప్ర‌క‌ట‌నలు పిల్ల‌ల‌ను ఆక‌ర్షిస్తాయి. వాటి గురించి పిల్ల‌ల‌కు వాస్త‌వం ఏదో తెలియ‌జేయండి. ఇంట్లో జ‌రిగే సంఘ‌ట‌న గురించి కూడా పిల్ల‌ల‌కు వీలైనంత వ‌ర‌కు వాస్త‌వాల‌ను చెప్పే ప్ర‌య‌త్నం చేయండి.

ఇది కూడా చ‌ద‌వండి :  ‘క్యాష్’ ప్రోగ్రామ్‌కి సుమ రెమ్యున‌రేష‌న్‌ ఎంత తీసుకుంటుందో తెలుసా..?

Visitors Are Also Reading