బిగ్ బాస్ సీజన్ -6 లో మొదటిరోజు నుంచే గొడవలు మొదలైన విషయం విధితమే. ఇదిలా ఉంటే.. ఇక రాబోయే గొడవలు ఏ స్థాయికి వెళ్తాయా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 21 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ షోలో కొందరూ కంటెస్టెంట్లు చీటికి మాటికి వాగ్వాదానికి దిగుతుంటే మరికొందరూ కంటెస్టెంట్లు మాకేం పట్టలేదంటూ కాముగా ఉంటున్నారు. ఈ సీజన్‌లో మొదటి కెప్టెన్ కోసం బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ నిర్వహించారు. ఫైమా సంచాలకురాలిగా నిర్వహించింది.
Advertisement
కెప్టెన్సీ పోటీదారులుగా క్లాస్ సెక్షన్‌లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి, నేహా చౌదరి సహా మాస్ సెక్షన్ నుంచి మెరానా రోహిత్, ఆర్జే సూర్య, బాలాదిత్యలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికయ్యారు. అయితే టాస్క్ జరుగుతున్నప్పుడు కూడా కంటెస్టెంట్ల మధ్య గొడవ జరిగింది. చీటింగ్ చేస్తుందంటూ మెరీనా గీతుపై ఫైర్ అయింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. మరోవైపు ఫైమా-నేహా చౌదరి మధ్య కూడా వాగ్వాదం జరిగినట్టు ప్రోమో చూస్తే అర్థం అవుతోంది.
Advertisement
ఇది కూడా చదవండి : అనసూయపై ఇండస్ట్రీలో భారీ కుట్ర.. అసలు కారణం తెలిస్తే మీరు షాకవుతారు..!!
మరోవైపు ముఖ్యంగా బిగ్ బాస్ ఇంట్లోకి గలాట గీతూ వచ్చేసింది. వచ్చిన క్షణం నుంచే గీతూ నానా హంగామా చేసింది. అతికి అంబాసిడర్ అయిపోయింది. తనకు తానే అతి బిడ్డ అని చెప్పేసుకుంది. అతిబిడ్డ అతిని చూడలేక జనాలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా అన్ని కెమెరాల్లో కూడా కనిపించాలని ఆరాటపడుతోంది. వరస్ట్ కంటెస్టెంట్ ని జైలులోకి పంపించడం ఆనవాయితే. ఈసారి తొలి కెప్టెన్ గా బాలాదిత్య గెలిచాడట. అయితే గీతూని అందరూ ఎప్పుడు ఎలిమినేట్ చేద్దామా అని సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : ఎలిజబెత్ -II పెళ్లికి నిజాం నవాబ్ గిప్ట్ ఇచ్చిన విషయం మీకు తెలుసా..?