భారత జట్టులోకి ఈ మధ్య కాలం ఎక్కువ మంది ఆటగాళ్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు కారణం బీసీసీఐ తీసుకువచ్చిన కొత్త రకం ప్లాన్. అదే ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడం. చిన్న జట్లు అయితే ఒక్క జట్టును పంపించడం.. పెద్ద జట్టు అయితే మరొక జట్టును పంపించడం చేస్తూ వచ్చింది. కానీ అప్పుడు దానిని పెద్దగా పట్టించుకోని భారత అభిమానులు ఇప్పుడు ఆసియా కప్ లో ఓటమి తర్వాత వాటిపైనే ఫోకస్ చేసారు అనేది నిజం.
Advertisement
ఇక తాజాగా భారత మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్ కూడా బీసీసీఐ యొక్క ఈ విధానంపై విమర్శలు అనేవి గుప్పించాడు. ఆటగాళ్లకు ఎక్కువగా రెస్ట్ ఇస్తూ.. జట్టులో మార్పులు చేయడం వల్ల జట్టులో ఒక్క సింక్ అనేది లేకుండా పోయింది అని ఆయన అన్నారు. అలాగే వచ్చిన ఆటగాళ్లు మళ్ళీ జట్టులో సెటిల్ కావడానికి ఎక్కువగా సమయం పడుతుంది అని.. కానీ వారికీ బీసీసీఐ ఆ సమయం ఇవ్వడం లేదు అని పేర్కొన్నారు.
Advertisement
కేఎల్ రాహుల్ ను అందుకు ఉదాహరణగా చూపించారు. రాహుల్ ఎక్కువగా జట్టుకు దూరం అయ్యాడు. మళ్ళీ జట్టులోకి వచ్చేముందు అతనికి సమయం కూడా దొరకలేదు. కై వెంటనే ఆసియా కప్ లోకి వచ్చి విఫలం అయ్యాడు. అందుకే ఇకనైనా ఆటగాళ్లు రెస్ట్ అనే పదాని మరిచిపోయి జట్టు ఆడే ప్రతి మ్యాచ్ కు అందుబాటిలో ఉండాలని చెప్పారు. అంతలా రెస్ట్ కావాలి అంటే ఐపీఎల్ ఆడకండి ఖరాకండిగా చెప్పేసాడు.
ఇవి కూడా చదవండి :