మనం నిత్య జీవితంలో ఫుడ్, లైఫ్ తదితర ఎంత కామన్ అయ్యాయో మన ఆరోగ్య సమస్యలు కూడా అంతే కామన్ అయిపోయాయి. ఈ మధ్యకాలంలో 30 సంవత్సరాల వయస్సులోనే చాలా మంది షుగర్, బీపీ వంటి వాటి బారిన పడుతున్నారు .ముఖ్యంగా ప్రస్తుతం ఎక్కువగా జన్యుపరంగా షుగర్ అనేది వస్తుంది. అనగా ఇంట్లో ఎవరికో ఒకరికి రావడం.. ఆ తరువాత మన వద్దకి వస్తుంది. ప్రస్తుతం జీవన శైలిలో ఇలాంటి మార్పుల వల్లనే ఎక్కువగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. కారణం ఏదైనా కానీ వచ్చిన షుగర్ ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇంట్లో మనం ప్రతి రోజు ఉపయోగించే వెల్లుల్లి, దాల్చిన చెక్కలో ఎన్నో పోషక విలువలున్నాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఇది ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి అద్భుతంగా పని చేస్తుంది. వెల్లుల్లి కేవలం ఆహారంలో రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యంగా ఉంచేందుకు లాభదాయకంగా పని చేస్తుంది. ఇందులో తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ వల్ల ఆహారం సాఫీగా జీర్ణం కావడానికి సహకరిస్తుంది. వెల్లుల్లిలో ఉండే ఎమినో యాసిడ్స్, హోమో సిస్ట్రీస్ శాతం తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఈ కారణంగానే చక్కర స్థాయి నియంత్రణలో ఉంటుందని పేర్కొన్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : మీకు ముఖం మీద పుట్టుమచ్చలు ఉన్నాయా..? అవి వేటికి సంకేతమంటే..?
Advertisement
దాల్చిన చెక్క సైతం ఔషద గుణాలు మెండుగా ఉన్నాయి. చాలా రకాల అనారోగ్య సమస్యలకు సహాయపడుతుంది. ఇందులో యాంటి ఆక్సిడెంట్, యాంటి ఇంప్లామేటరి గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. వ్యక్తిలో ఉన్న చక్కర శాతాన్ని తగ్గించడంలో, కొలెస్ట్రాల్ లెవెల్‌ను తగ్గించడంలో కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. వెల్లుల్లి-దాల్చిన చెక్కతో టీ తయారు చేసుకుంటే మందులు కూడా అవసరం లేదు. ఆ డ్రింక్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువకి, అప్పుల విలువకి తేడా ఎంతో తెలుసా..?
- తొలుత రెండు వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి కొంచెం కచ్చ పెచ్చ దంచాలి.
- ఆ తరువాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోయాలి. కొంచెం పంచదార వేసి కలపండి. గిన్నెలో దంచిన వెల్లుల్లి, కొంచెం దాల్చిన చెక్కను వేయండి.
- గిన్నెలో నీళ్లు సగం వచ్చే దాకా బాగా మరిగించండి.
- నీళ్లు సగం అవ్వగానే స్టవ్ ఆప్ చేసి టీని వడగట్టండి.
- ఇప్పుడు మీరు తయారు చేసుకున్న వెల్లుల్లి- దాల్చిన చెక్కతో తయారు చేసిన ఈ డ్రింక్ తాగండి. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. దీంతో మీ శరీరంలో చక్కర శాతం తగ్గడం ఖాయం.
ఇది కూడా చదవండి : అధిక బరువు ఉన్న వారు చికెన్ అస్సలు తినకూడదు.. జాగ్రత్త..!