Telugu News » Blog » ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస్తుల విలువకి, అప్పుల విలువ‌కి తేడా ఎంతో తెలుసా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస్తుల విలువకి, అప్పుల విలువ‌కి తేడా ఎంతో తెలుసా..?

by Anji
Ads

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే చాలు.. టీజ‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే సెల‌బ్రేష‌న్ స్టార్ట్ చేస్తారు. ఇక ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌లు అయితే మూడు నెల‌ల ముందుగానే జ‌రుపడం ప్రారంభ‌మ‌వుతుంటుంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాల్లో రాణిస్తున్నారు. రాజ‌కీయాలు ప‌క్క‌కు పెడితే.. సినిమాల్లో ప‌వ‌న్ ఒక్కో చిత్రానికి రూ.50కోట్ల‌కి పైగానే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నార‌ట‌.

Ads

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస్తుల విలువ ఎంత అనేది ఎవ్వ‌రూ అస‌లు ఊహించ‌లేరు. ఎందుకంటే అత‌ను సంపాదించేది ఒక ఎత్త‌యితే దానిని ఉప‌యోగించేది కూడా మ‌రో ఎత్త‌ని చెప్పాలి. ఇత‌ర స్టార్ హీరోల‌కు ఉన్న ఆస్తులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి లేవ‌నే చెప్పాలి. ప‌వన్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్‌గా జ‌న‌సేన పార్టీని న‌డుపుతున్నారు. ఆ భారం కూడా ఉంద‌ని, ఆస్తులు ఎక్కువ‌గా పోగు చేసుకోలేదు. ప‌వ‌న్ క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించ‌డానికి స్వ‌స్తీ చెప్పి చాలా కాల‌మే అవుతోంది. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్ల వ‌ర‌కు ఉండే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొంటున్నారు. వాటిలో జూబ్లీహిల్స్‌లో ఖ‌రీదు అయిన ఇంటితో పాటు, హైద‌రాబాద్ శివారులో 18 ఎక‌రాల ఓ ఫామ్ హౌస్ ఉంది. ఇక ఫామ్ హౌస్ విలువ దాదాపు రూ.25కోట్లకు పైగా ఉంటుంద‌ని స‌మాచారం.

Ads
Ad

  ఇది కూడా చ‌ద‌వండి :  రెండో పెళ్లి చేసుకోబోతున్న మెగా అల్లుడు క‌ల్యాణ్ దేవ్…? వ‌ధువు ఎవ‌రంటే..?


ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి 312 గ్రాములు క‌లిగిన బంగారం ఉంది. అత‌ను బిగ్ సెలెబ్రిటీ, జ‌న‌సేన అధినేత కావ‌డంతో కార్ల వినియోగం చాలా ఎక్కువ‌గానే ఉంటుంది.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మెర్సిడెస్‌బెంజ్ క్లాస్ కారు, వోల‌వో ఎక్స్ సీ 90, బీఎండ‌బ్ల్యూ 5 సిరీస్‌, ఆడీ క్యూ 7 లాంప్ వంటి ఖ‌రీదు చేసే కార్లున్నాయి. ఇక ప‌వ‌న్ భార్య అన్నా లెజినోవా వ‌ద్ద రూ.30ల‌క్ష‌ల విలువైన చ‌రాస్తులు ఉన్న‌ట్టు స‌మాచారం. పెద్ద‌కుమారుడు అకిరా పేరు రూ.1.5 కోట్లు, కుమార్తె ఆద్య పేరు పై 1.04 కోట్ల ఆస్తులు ఉన్నాయి. చిన్న‌ కుమారుడు మార్క్ శంక‌ర్ పై, మో కుమార్తె పోలేనా పేరుపై మాత్రం ఎలాంటి ఆస్తులు లేవు. అదేవిధంగా ప‌వ‌న్ దాదాపు రూ.30 కోట్ల‌కి పైగా అప్పు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌కి ఉన్న ఏకైక ఆదాయం మాత్రం సినిమా మాత్ర‌మే. ప‌వ‌న్ ఏ వ్యాపారాల్లో ఎక్క‌డా కూడా పెట్టుబ‌డులు పెట్ట‌లేదు.

ఇది కూడా చ‌ద‌వండి :  జీవితంలో చేసిన ఆ ఒక్క త‌ప్పు వ‌ల్ల ఆస్తుల‌న్నీ కోల్పోయిన హీరోయిన్ క‌ల్యాణి….? ఆ త‌ప్పు ఏంటంటే..?