సాధారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మందికి చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ తరుణంలోనే తెల్ల జుట్టును దాచుకునేందుకు చాలా మంది కలర్లపై ఆధారపడుతుంటారు. కలర్ల కోసం వేలకు వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం నువ్వులు, ఉసిరి ఈ రెండు పదార్థాలతో తెల్ల జుట్టు సమస్యను వదిలించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
తొలుత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి వాటర్ బాగా కలిపి పక్కనే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి. వాటర్ వేడి అయిన తరువాత కప్పు ఎండిన ఉసిరికాయ ముక్కలు వేసి 15 నిమిషాల పాటు నీరు దగ్గర పడే వరకు బాగా ఉడికించాలి. ఇక ఉసిరి కాయ ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి.
Advertisement
ఇది కూడా చదవండి : మీరు బీరు తాగుతున్నారా..? ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే మానేయండి..!
ఇక ఆ తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించిన ఉసిరికాయ ముక్కలు, నానబెట్టుకున్న నువ్వులు పెరుగు మిశ్రమం వేసి పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ ఫేస్ట్ లో రెండు టేబుల్ స్పూన్ల బాదం ఆయిల్ మిక్స్ చేసుకుంటే ఫ్యాక్ సిద్ధమైనట్టే. ఈ ఫ్యాక్‌ని ఎలా వినియోగించాలంటే.. తొలుత జుట్టుకు ఎలాంటి నూనె లేకుండా చూసుకోవాలి. ఆ తరువాత తయారు చేసుకున్న ప్యాక్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి. కనీసం నాలుగు గంటల పాటు ప్యాక్‌ని ఉంచుకున్న తరువాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం ఒకసారి చేశారంటే తెల్ల జుట్టు నల్లగా కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించి మీ తెల్లని జుట్టును నల్లగా మార్చుకోండి.
ఇది కూడా చదవండి : Chanakya Niti : విజయం సాధించాలంటే చాణక్య చెప్పిన ఈ 4 మార్గాలు అనుసరించండి..!