Home » శ్రీరామ్ కు ఓటేయ‌కండి..అత‌డ‌కి వేయండి..శ్రీరెడ్డి ప్ర‌చారం..!

శ్రీరామ్ కు ఓటేయ‌కండి..అత‌డ‌కి వేయండి..శ్రీరెడ్డి ప్ర‌చారం..!

by AJAY
Ad

బిగ్ బాస్ సీజ‌న్ 5 ఫైన‌ల్ కు చేరుకుంది. ఈవారం టాప్ ఆరుగురిలో ఒక‌రు ఎలిమినేట్ అయితే వ‌చ్చేవారం ఫైన‌ల్ విజేత ఎవ‌ర‌న్న‌ది తేల‌నుంది. ఇక ఇప్ప‌టికే సింగ‌ర్ శ్రీరామ్ చంద్ర ఫైన‌ల్ కు చేరిన సంగ‌తి తెలిసిందే. కాగా శ్రీరెడ్డికి ఓటేయ్య‌కండి అంటూ వివాదాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి ప్రచారం మొద‌లు పెట్టింది. అంతే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ ష‌ణ్ముక్ జ‌స్వంత్ కు ఓటేయాల‌ని కోరుతోంది. వ్య‌క్తిత్వం ఉన్న వ్య‌క్తులు గెలిస్తే స‌మాజానికి ఉప‌యోగం ఉంటుంద‌ని…కాబ‌ట్టి శ్రీరామ చంద్ర గెల‌వ‌డం వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేదంటూ ఆరోపించింది.

srireddy sriramchandra

srireddy sriramchandra

ఇండియ‌న్ ఐడ‌ల్ గెలిచాడు కాబ‌ట్టి బిగ్ బాస్ టైటిల్ ఇచ్చేయ‌డం స‌రికాదంటూ శ్రీరెడ్డి వ్యాక్యానించింది. అన‌వ‌స‌ర‌మైన వ్య‌క్తుల‌ను ఫేక్ గా న‌టించేవారిని న‌మ్మకూడ‌దు అని అలాంటి వారికి ఓటేయ‌కూద‌ని అని శ్రీరెడ్డి ఆరోప‌ణ‌లు చేసింది. అంతే కాకుండా ష‌ణ్ముక్ కెరీర్ ప్రారంభించిన తొలినాళ్ల‌లో అత‌డి గురించి అత‌డు ఎంతో టాలెంటెడ్ అని పోస్ట్ పెట్టాన‌ని..డౌన్ టూ ఎర్త్ అత‌డు ఎంతో జెన్యూన్ ప్లేయ‌ర్ అంటూ శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. షేక్ గా ఉండ‌డు అని గేమ్ కూడా భాగా ఆడుతున్నాడ‌ని చెప్పింది. ఇక త‌న‌తో శ్రీరామ్ చాటింగ్ చేసిన్న‌ట్టు స్క్రీన్ షాట్ లు వైర‌ల్ అవుతున్నాయ‌ని అవ‌న్నీ నిజంగానే జ‌రిగాయ‌ని చెప్పింది.

Advertisement

Advertisement

also read : సింగర్ శ్రీరామ్ పై కుట్ర జరుగుతోందా…ఆ స్క్రీన్ షాట్ లను కావాలనే వైరల్ చేస్తున్నారా…?

మ‌రోవైపు బిగ్ బాస్ పెంట అంటూ మ‌రోసారి బుర‌ద చ‌ల్లింది. బిగ్ బాస్ ఓ పెంట అని అస‌లు షో చూడ‌ను కానీ అప్పుడప్పుడు క్లిప్పింగ్ లు చూస్తాన‌ని చెప్పింది. ఇండియ‌న్ ఐడిల్ గెలిచినప్ప‌టికీ శ్రీరామ్ చేసిన పాపాల వ‌ల్లే ఇంకా అలానే ఉన్నాడు అంటూ బాంబు పేల్చింది. ఇండియ‌న్ ఐడ‌ల్ ను అడ్డం పెట్టుకుని అమ్మాయిలతో చాటింగ్ చేయ‌డం….ఇంకా ఏవేవో చేయాల‌నుకోవడం లాంటివి చేసాడు కాబట్టే ఇలా ఉన్నాడు అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

Visitors Are Also Reading