Home » బుల్లితెర నటి శ్రీవాణి గొంతుకు ఏమైంది.. ఇక ఆమె మాట్లాడటం కష్టమేనా..?

బుల్లితెర నటి శ్రీవాణి గొంతుకు ఏమైంది.. ఇక ఆమె మాట్లాడటం కష్టమేనా..?

by Sravanthi
Ad

సీరియల్స్ లో నటిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రీవాణి అంటే తెలియనివారుండరు.. ఆమె తనదైన నటనతో బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. నిత్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా చలాకీ గా కనిపించే శ్రీవాణి గొంతు మూగబోయింది.. ఆమె గొంతులో అనేక మార్పులు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఆమె వాయిస్ లో ఏదో చేంజింగ్ రావడంతో చాలామంది జలుబు అనుకున్నారు.. ఆమె గొంతు గురించి రకరకాల కామెంట్స్ కూడా చేశారు..

Advertisement

ALSO READ; బ్రేకప్ సందేశం ఇచ్చేసిన గిల్, సారా..!

Advertisement

కానీ శ్రీవాణి గొంతు నుండి పూర్తిగా మాటలు రాక పోవడంతో ఆమె డాక్టర్ దగ్గరకు వెళ్లి చూయించుకున్నారు. దీంతో వైద్యులు ఆమె గొంతు కాస్త సీరియస్ గానే ఉందని చెప్పారు. దీనికి ప్రధాన కారణం షూటింగ్ సమయంలో ఆమె ఎక్కువగా మాట్లాడటంతో గొంతులో ఇన్ఫెక్షన్ అయ్యిందని వైద్యులు తెలియజేశారు. ఒక నెల రోజుల పాటు శ్రీవాణి మాట్లాడకుండా ఉంటేనే మాట తిరిగి వస్తుందని లేదంటే ఆమెకు జీవితాంతం కూడా మాటలు రావని డాక్టర్లు అన్నట్టు శ్రీవాణి భర్త విక్రమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..

నెల రోజుల వరకు ఎలాంటి మాటలు కూడా మాట్లాడకుండా ఉంటే మళ్ళీ ఎప్పటిలాగే మాట్లాడుతుందని డాక్టర్లు అన్నారట.దీంతో ఆమెకు నయం కావాలని దేవున్ని ప్రార్థించండి అంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీ వాణి భర్త వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

ALSO READ;

Visitors Are Also Reading