Home » క‌థ ఎంపిక‌లో ఎన్టీఆర్ మామూలోడు కాదుగా…లైగర్ స‌హా ఈ సినిమాలన్నీ రిజెక్ట్ చేశాడ‌ట‌..?

క‌థ ఎంపిక‌లో ఎన్టీఆర్ మామూలోడు కాదుగా…లైగర్ స‌హా ఈ సినిమాలన్నీ రిజెక్ట్ చేశాడ‌ట‌..?

by AJAY
Ad

సినిమా అంటే ముందుగా క‌థ బాగుండాలి. క‌థ బాగుంటేనే సినిమా కూడా బాగుంటుంది. కాబ‌ట్టి క‌థ‌ల ఎంపిక‌లో హీరోలు హీరోయిన్ లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. స‌రైన క‌థ‌ను ఎంపిక చేసుకుంటే హిట్ ప‌డే అవ‌కాశం ఉంటుంది. అదే విధంగా స‌రైన క‌థ‌ను ఎంపిక చేసుకోక‌పోతే ఫ్లాప్ ప‌డే అవ‌కాశం ఉంటుంది. కాగా రీసెంట్ గా వ‌చ్చిన లైగ‌ర్ సినిమాకు నెగిటివ్ టాక్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ముందుగా ఎన్టీఆర్ కు వెళ్ల‌గా ఆయ‌న రిజెక్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి: ఎన్టీఆర్ అమిత్ షా భేటీకి తెర వెనుక ఉన్న‌దెవ్వ‌రు..? బీజేపీ ఇచ్చిన హింట్ అదేనా..?

Advertisement

 

ఆ త‌ర‌వాత ఇదే క‌థ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు వెళ్ల‌గా ఆయ‌న ఓకే చెప్పారు. అలా ఎన్టీఆర్ లైగ‌ర్ ను మిస్ చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ మ‌రికొన్ని సినిమాల‌ను కూడా రిజెక్ట్ చేసి ఫ్లాప్ ల‌ను త‌ప్పించుకున్నారు. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన బ్ర‌హ్మోత్స‌వం సినిమా మొద‌ట ఎన్టీఆర్ వ‌ద్ద‌కే వ‌చ్చింది. శ్రీకాంత్ అడ్డాల ఎన్టీఆర్ కు క‌థ వినిపించ‌గా ఆయ‌న రిజెక్ట్ చేశారు.

Advertisement

ఇవి కూడా చదవండి: ఎంత సంపాదించినా మిమ్మ‌ల్ని ద‌రిద్రం వెంటాడుతుందా..? అయితే ఈ 3 అల‌వాట్లు త‌ప్ప‌క మానుకోండి..!

 

ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. నితిన్ హీరోగా న‌టించిన శ్రీనివాస క‌ల్యాణం సినిమా కూడా ఎన్టీఆర్ వ‌ద్ద‌కే వ‌చ్చింది. కానీ ఈ సినిమా క‌థ విని కూడా ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. అంతే కాకుండా నితిన్ హీరోగా న‌టించిన మ‌రో సినిమా లై కూడా మొద‌ట ఎన్టీఆర్ వ‌ద్ద‌కే వెళ్లింది.

ఇవి కూడా చదవండి: “మ‌న్మ‌ధుడు” సినిమా హీరోయిన్ మ‌హి ఇప్పుడు ఎక్క‌డ ఉందో…? ఏం చేస్తుందో తెలుసా..?

 

ఈ సినిమా క‌థ న‌చ్చ‌క‌పోవ‌డం తో ఎన్టీఆర్ నో చెప్పారు. ఆ త‌ర‌వాత అదే క‌థ‌ను నితిన్ కు చెప్ప‌గా ఆయ‌న ఓకే చెప్పారు. అల్లు అర్జున్ హీరోగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చిన సినిమా నా పేరు సూర్య‌. ఈ సినిమా క‌థ‌ను ద‌ర్శ‌కుడు మొద‌ట ఎన్టీఆర్ కు వినిపించాడు. కానీ ఎన్టీఆర్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. అలా ఎన్టీఆర్ మొత్తం ఐదు ఫ్లాప్ సినిమాల‌ను రిజెక్ట్ చేశారు.

Visitors Are Also Reading