Home » కూతురి మీద ప్రేమ‌తో కోబ్రా ద‌త్త‌త‌.. ఆ చిన్నారి ఏం చేసిందంటే..!

కూతురి మీద ప్రేమ‌తో కోబ్రా ద‌త్త‌త‌.. ఆ చిన్నారి ఏం చేసిందంటే..!

by Anji
Ad

సాధార‌ణంగా పిల్ల‌ల పుట్టిన రోజంటే కొత్త బ‌ట్ట‌లు, గుడికి వెళ్ల‌డం, చాక్లెట్లు పంచ‌డం, కేక్ క‌ట్ చేయించ‌డం వంటివి చేస్తుంటారు. వారికి స్నేహితులు, కుటుంబ స‌భ్యులు గిప్ట్ లు ఇవ్వ‌డం అంద‌రికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఓ ఆరేళ్ల చిన్నారి త‌న పుట్టిన రోజున ఎవ్వ‌రూ చేయ‌ని ఓ గొప్ప ప‌ని చేసింది. కేవ‌లం త‌ను మాత్ర‌మే కాదు.. త‌న పుట్టిన రోజు కానుక‌గా త‌న తండ్రితో కూడా చేయించింది. చిన్నారులు సాధార‌ణంగా జూకి వెళ్లితే అక్క‌డుంఏ జంతువుల‌ను చూసి సంబుర ప‌డుతుంటారు. కేరింత‌లు కొడుతుంటారు. జూపార్క్‌లో ర‌క‌ర‌కాల జంతువులు, ప‌క్షుల‌ను చూసి వాటితో స‌ర‌దాగా ఆడుకుంటూ తెగ మురిసిపోతుంటారు.

Advertisement

ముఖ్యంగా జూలో క‌నిపించే ఏనుగులు, ఒంటెలు, గుర్రాల వంటి వాటిపై స‌ర‌దాగా చ‌క్క‌ర్లు కొడుతుంటారు. ఇక ఆ త‌రువాత ఎవ్వ‌రింటికి వాళ్లు వెళ్లిపోతుంటారు. ఇక్క‌డ ఓ చిన్నారి మాత్రం అలా కాదు.. జూ పార్క్‌లో ఉన్న‌టువంటి ప‌క్షుల‌ను ద‌త్త‌త తీసుకుంది. వాటి ఆల‌నా పాల‌నా చూసుకుంటూ వాటికి ఆహారం అందించేందుకు హామి ఇచ్చింది. ఇక అంతే కాదు.. ఆ చిన్నారి తండ్రి సైతం కింగ్ కోబ్రాను ద‌త్త‌త తీసుకున్నారు. హైద‌రాబాద్‌లో నెహ్రు జూ పార్క్‌లో చిన్ని చిన్నిప‌క్షులు, ఇండియ‌న్ కింగ్ కోబ్రాను ద‌త్త‌త తీసుకున్న ఆ తండ్రి కూతురు త‌మ పెద్ద మ‌న‌స్సును చాటుకున్నారు. దీంతో ఆ ఇద్ద‌రూ అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  ఎంత సంపాదించినా మిమ్మ‌ల్ని ద‌రిద్రం వెంటాడుతుందా..? అయితే ఈ 3 అల‌వాట్లు త‌ప్ప‌క మానుకోండి..!

Advertisement

మామూలుగా మంచి, మాన‌వ‌త్వం మెండుగా ఉండే చాలా మంది సెల‌బ్రెటీలు, వీఐపీలు అనాథ పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకోని వారి బాగోగులు చూసుకుంటుంటారు. అంతకు మించి కుదిరితే ఒక‌టి రెండు గ్రామాల‌ను కూడా ద‌త్త‌త తీసుకొని గ్రామాభివృద్ధికి పాటుప‌డుతారు. అదేవిధంగా హైద‌రాబాద్‌లోని కుత్బుల్లాపూర్ బాలాన‌గ‌ర్ నివాసి అయిన శ్రీ‌ప్ర‌మోద్ ర‌చ్చ అత‌ని ఆరేళ్ల కూతురు బేబీ హ‌ర్షివి ర‌చ్చ త‌న 6వ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిన్న చిన్న ప‌క్షుల‌ను ద‌త్త‌త తీసుకుంది. ఇక ఆ చిన్నారి తండ్రి ప్ర‌మోద్ కూడా ఇండియ‌న్ కింగ్ కోబ్రాను ద‌త్త‌త తీసుకున్నాడు.

ఇవి కూడా చ‌ద‌వండి :  పెరుగులో ఇది క‌లుపుకుని తింటే లాభాలెన్నో.. దాని గురించి తెలిస్తే మాత్రం ఇక వ‌ద‌ల‌రు..!

ఇక ఈ ఏడాది ఆగ‌స్టు 27, 2022 నుంచి హైద‌రాబాద్ నెహ్రు జూ లాజిక‌ల్ పార్క్‌లో 6 నెల‌ల పాటు 5 చిన్న ప‌క్షుల‌ను ద‌త్త‌త తీసుకుంది. చిన్నారి తండ్రి ప్ర‌మోద్ ఇంటీరియ‌ల్ డిజైనింగ్ వ‌ర్క్ చేస్తున్నారు. అత‌డు త‌న కంపెనీ M/s త‌రుపున నెహ్రు జూలాజిక‌ల్ పార్కు హైద‌రాబాద్‌లో 6 నెల‌ల పాటు ఇండియ‌న్ కింగ్ కోబ్రానుద‌త్త‌త తీసుకున్నారు. ప్ర‌మోద్ ర‌చ్చ రూ.20,000 జూ సిబ్బందికి అంద‌జేశారు. ఇందులో చిన్న ప‌క్షుల‌కు రూ.10,000 ఇండియ‌న్ కోబ్రాకు రూ.10,000 చొప్పున ఆన్‌లైన్ చెల్లింపు విధానం ద్వారా ద‌త్త‌త ఛార్జీల కోసం చెల్లించారు. నెహ్రు జూ లాజిక‌ల్ పార్కు హైద‌రాబాద్‌కి ప‌క్షుల‌ను ద‌త్త‌త తీసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించినందుకు, పుట్టిన రోజు కానుక‌గా త‌న బిడ్డ కోరిక‌ను తీర్చినందుకు ప్ర‌మోద్ ధ‌న్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  ఎన్టీఆర్ అమిత్ షా భేటీకి తెర వెనుక ఉన్న‌దెవ్వ‌రు..? బీజేపీ ఇచ్చిన హింట్ అదేనా..?

Visitors Are Also Reading