నేడు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పదవి విరమణ చేయనున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ లలిత్ బాధ్యతలు స్వీకరింనున్నారు.
సీఎం జగన్ నేడు విశాఖ లో పర్యటిస్తారు. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ఐదేళ్లపాటు నదులు, సముద్రాల్లోని ప్లాస్టిక్ వ్యర్ధాలు తొలగించేలా నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా తొలిసారిగా విశాఖలో రీ సైక్లింగ్ ప్లాస్టిక్ యూనిట్ ను ప్రారంభించబోతున్నారు.
Advertisement
నేడు జాతీయ కార్మిక సదస్సు ముగింపు కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సీఎం పాల్గొననున్నారు. కేంద్ర కార్మికశాఖ తలపెట్టిన జాతీయ కార్మిక సదస్సుని ప్రధాని తిరుపతిలో నిన్న వర్చువల్ గా ప్రారంభించారు.
ఎమ్మెల్యే రాజా సింగ్ వాఖ్యలకు నిరసన గా నేడు చార్మినార్ లో నిరసనలకు పిలుపును ఇచ్చారు. రాజా సింగ్ అరెస్ట్ కావడంతో నిరసనలు వద్దని ఓవైసీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు మక్కా మసీదు పరిసరాల్లో అణువణువు నిఘా ఏర్పాటు చేశారు.
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లు నిండి భక్తులు వెలుపల క్యూ లైనులో వేచి ఉన్నారు. భక్తుల సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతొంది. నిన్న 68,128 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 34,021 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు.
సోషల్ మీడియాలో పోస్టులపై హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు అయ్యింది. పీడీ యాక్ట్ లో కీలక అంశాలు ఉన్నాయి. 32 పేజీల పీడీయాక్ట్ డాక్యుమెంట్ ను రాజాసింగ్‌కు అందజేశారు. రాజాసింగ్‌పై దేశవ్యాప్తంగా 101 కేసులు నమోదయ్యాయి.
ఋతపవనాలు తిరోగమనం పట్టాయి. ప్రతి ఏడాది కంటే 15 రోజుకు ముందుగానే ఋతుపవనాలు వెళ్లిపోతున్నాయి అని వాతావరణ శాఖ వెల్లడించింది.
అక్టోబర్ 12 నాటికి దేశంలోని పలు నగరాల్లో 5 జి సేవలు ప్రారంభం కాకున్నాయి. హైదరాబాద్ లో కూడా ఆ నాటికి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
నేడు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51.820 కి చేరుకుంది. కాగా 22 క్యారెట్ ల బంగారం ధర రూ. 47,500 గా ఉంది.