Home » స్మార్ట్ ఫోన్ సాయంతో సీక్రెట్ కెమెరాను ఎలా గుర్తించాలో తెలుసా..?

స్మార్ట్ ఫోన్ సాయంతో సీక్రెట్ కెమెరాను ఎలా గుర్తించాలో తెలుసా..?

by Anji
Ad

ప్రస్తుత కంప్యూట‌ర్ కాలంలో రోజు రోజు టెక్నాల‌జీ పెరిగిపోతుంది. టెక్నాల‌జీకి అనుగుణంగా మ‌నం వ్య‌వ‌హ‌రిస్తేనే బాగుంటుంది. లేకుంటే మ‌నం వెనుక‌బ‌డిన‌ట్టే లెక్క‌. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో మ‌నం ఎక్క‌డికి అయినా వెళ్లిన‌ప్పుడు అక్క‌డే కొద్దిరోజులు ఉండాల్సి వ‌స్తుంది. అప్పుడు ఏదైనా హోల్ రూమ్స్, లాడ్జ్‌, హాస్ట‌ల్స్, పెయింగ్ గెస్ట్ ఇలా వివిధ చోట్ల స్టే చేయాల్సి ఉంటుంది. అలాంటి చోట సీక్రెట్ కెమెరాలు పెట్టిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:  బాలయ్య బాబు ఖర్చులు చూసి ఆశ్చర్యపోయిన అన్నగారు.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..!

Advertisement


ముఖ్యంగా ఈస్పై, హిడెన్ కెమెరాలు మ‌నం గుర్తించ‌లేనంత చిన్న‌విగా ఉంటాయి. వాటిని గుర్తించ‌డం అంత తేలికైన విష‌యమేమి కాదు. కెమెరాలు అక్క‌డి ప‌రిస‌రాల్లో క‌లిసిపోయి ఏ మాత్రం క‌నిపించ‌కుండా ఉంటాయి. బెడ్రూమ్ లేదా బాత్రూమ్ వంటి ప్ర‌యివేటు ప్రాంతాల్లో ఈ సీక్రెట్ కెమెరాల‌ను అమ‌ర్చిన‌ట్టు మ‌న‌కు అనుమానం వ‌చ్చిన వెంట‌నే ఏం చేయాలి. అస‌లు వాటిని గుర్తించ‌డానికి నిపుణుల సహాయం తీసుకోవ‌చ్చు. ప్ర‌త్యేక‌మైన ప‌రిక‌రాల‌తో ప‌సి గ‌ట్ట‌వ‌చ్చు. అవి ఒక్కోసారి మ‌న‌కు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు. అలాంట‌ప్పుడు మ‌న స్మార్ట్ ఫోన్ ద్వారానే సింపుల్‌గా ఈ సీక్రెట్ కెమెరాల‌ను గుర్తించ‌వ‌చ్చు. అందుకోసం మ‌నం ఏం చేయాలో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

ఇవి కూడా చదవండి: తన సినిమా విడుదల కోసం ఆనాటి “ఇందిరా గాంధీ” ప్రభుత్వానితో ఎందుకు NTR గొడవ పడ్డారు ? అసలు కథ ఇదే !

తొలుత మీరు ఉండే గ‌దిలో లైట్ల‌ను ఆర్పివేయాలి. కిటికీల‌ను క‌ర్టెన్ల‌తో మూసేయ్యాలి. ఇక ఆ గ‌ది మొత్తం చీక‌టిగా ఉండేలా చూసుకోవాలి. మీ ఫోన్ లో ఫ్లాష్‌లైట్‌, కెమెరాను ఒకేసారి ఆన్ చేయండి. అప్పుడు ఇక్క‌డ సీక్రెట్ కెమెరా ఉండ‌వ‌చ్చనే అనుమానం ఉన్న చోట స్మార్ట్ ఫోన్ కెమెరాను ఫోక‌స్ చేయాలి. ఒక‌వేళ అక్క‌డ సీక్రెట్ కెమెరా ఉన్న‌ట్ట‌యితే మీ ఫోన్ స్క్రీన్ మీద వెలుగు మెరుపులు వ‌స్తాయి. ఫోన్‌లో ఫ్లాష్ లైట్ లేక‌పోతే.. వేరే ఫ్లాస్ లైట్ సాయంతో కెమెరాతో ఫోక‌స్ చేయాలి. ఫ్లాష్ లైట్ లేక‌పోయినా సీక్రెట్ కెమెరాల‌ను మ‌నం గుర్తింవ‌చ్చు. ప్ర‌ధానం సీక్రెట్ కెమెరాలు చీక‌టిలో ఇన్ ఫ్రారెడ్ కాంతిని ఉప‌యోగించుకుంటాయి. ఇన్ ఫ్రారెడ్ కాంతి అనేది మ‌న కంటికి క‌నిపించ‌దు. కానీ స్మార్ట్ ఫోన్ కెమెరా దీనిని గుర్తించ‌గ‌ల‌దు. ఫోన్ మెయిన్ కెమెరా దీనిని గుర్తించ‌లేదు. అందులో ఇన్ ఫ్రారెడ్ కాంతి ఫిల్ట‌ర్ ఉండ‌వ‌చ్చు. కాబ‌ట్టి ఫ్రంట్ కెమెరాను ఉప‌యోగించి కూడా గుర్తించ‌వ్చు. మ‌న ఫోన్ ఇన్ ఫ్రారెడ్ కాంతిని గుర్తిస్తుందా లేదా అనే విష‌యం తెలుసుకునేందుకు టీవీ రిమోట్ ద్వారా కూడా ప‌రీక్షించ‌వ‌చ్చు.

ఇవి కూడా చదవండి:  న‌టి స్నేహ చేసిన వ‌ర‌ల‌క్ష్మీ పూజకు హాజ‌రైన సీనియ‌ర్ హీరోయిన్స్‌.. సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైర‌ల్..!

 

Visitors Are Also Reading