Home » పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ క్యాప్ లేకుండా బ‌య‌టికే రావ‌డం లేదు.. కార‌ణం అదేనా..?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ క్యాప్ లేకుండా బ‌య‌టికే రావ‌డం లేదు.. కార‌ణం అదేనా..?

by Anji
Ad

సినీ ఇండ‌స్ట్రీకి చెందిన హీరోలు, హీరోయిన్లు త‌మ వ్య‌క్తిగ‌త విష‌యంలోనే కాకుండా త‌మ ఆరోగ్యం, అందం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. వీటిలో ఏదైనా ఒకసారి దెబ్బ తిన్న‌దంటే వారి జీవితం అయోమ‌యానికి గుర‌వ్వ‌డం ఖాయం. అందుకే న‌టీన‌టులు ఆరోగ్యం, అందం విష‌యంలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా త‌మ అందం, ఫిజిక్ విష‌యంలో మాత్రం వాళ్లు తీసుకునే జాగ్ర‌త్త‌లు అంతా ఇంతా కాదు. ఒక్క‌సారి త‌మ ఫిజిక్ అందం కోల్పోతే సినిమాల్లో అవ‌కాశాలు కూడా కోల్పోయిన‌ట్టే. ఇప్ప‌టికీ చాలా మంది న‌టీన‌టులు వీటి విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోవ‌డంతో సినిమాల్లో అవ‌కాశాలు కోల్పోయారు.


ఇక పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ ప‌రిస్తితి కూడా ఇదేవిధంగా మారేట‌ట్టు క‌నిపిస్తోంది. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్ ముఖ్యంగా బాహుబ‌లి సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోల కంటే ఎక్కువ‌గా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. బాహుబ‌లి త‌రువాత వ‌చ్చిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు రెండు కూడా అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. కానీ ప్ర‌భాస్‌కు ఉన్న ఫాలోయింగ్ మాత్రం అంతా ఇంతా కాదు.. ప్ర‌భాస్ వ్య‌క్తిత్వం గురించి ప‌లువురు న‌టీన‌టులు చెబుతుంటారు. ఇంత స్టార్ హీరో రేంజ్‌లో ఉన్న కూడా ఎప్పుడు ఈ స్థాయిలో ఉన్నాన‌ని ఫీల‌వ్వ‌డు ప్ర‌భాస్‌. ఇండ‌స్ట్రీలో స్టార్ న‌టుడ‌నే హోదా కాకుండా మంచి స్నేహితుడిగా ఉంటాడు ప్ర‌భాస్‌. మేక‌ప్ మ్యాన్ నుంచి ప్ర‌తి ఒక్కరినీ ఎంతో గౌర‌వంగా అభినందిస్తాడు. ఇక త‌న ఇంటి నుంచి త‌యారు చేసిన అభిరుచుల‌ను షూటింగ్ లో ఉన్న వారికి రుచి చూపిస్తానంటాడు.

Advertisement

Advertisement

ప్ర‌భాస్ కి వారి కుటుంబ స‌భ్యులు ర‌క‌ర‌కాల రుచులు చూపిస్తుంటార‌ట‌. మంచి ఫిజిక్ తో ఉండి మంచి అభిమానం సంపాదించుకున్నాడు. ఆయ‌న ఫిజిక్ వ‌ల్ల‌నే చాలా సినిమాలు ఆయ‌న‌కు ద‌రి చేరాయి. కానీ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఫిజిక్ లో మార్పులు వ‌చ్చాయి. అందం విష‌యంలో కొన్ని మార్పులు వ‌చ్చినట్టు తెలుస్తున్నాయి. ఇంత‌కు అదేంటంటే బ‌ట్ట‌త‌ల వ‌చ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఆయ‌న క్యాప్ లేకుండా బ‌య‌టికి రావ‌డం లేదని ఇటీవ‌లే జ‌రిగిన సీతారామం ఈవెంట్ లో ఆయ‌న క్యాప్ ధ‌రించుకొని వ‌చ్చాడ‌ని అంటున్నారు. ఎప్పుడు క్యాప్ వేసుకొని ప్ర‌భాస్ ఇప్పుడు త‌రుచుగా క్యాప్ ధ‌రిస్తున్నాడంటే ఆయ‌న‌కు నిజంగానే బ‌ట్ట‌త‌ల వ‌చ్చిందంటూ అందుకే అలా ధ‌రిస్తున్నాడు అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌భాస్ కి నిజంగానే బ‌ట్ట‌త‌ల వ‌చ్చిందా లేదా అనేది ప్ర‌భాస్ ను క్యాప్ లేకుండా చూసిన‌ప్పుడే స్ప‌ష్టంగా అర్థం అవుతోంది.

Also Read : 

ఎన్టీఆర్ ను ఇండస్ట్రీలో ఎవరెవరు ఏమని పిలిచేవారో తెలుసా..? అన్నగారు అని ఎందుకు పిలిచే వారంటే…?

“యోగి” సినిమా ఫ్లాప్ కు “ఠాగూర్” సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డానికి మ‌ధ్య లింకేంటి..? వినాయ‌క్ చేసిన మిస్టేక్ ఏంటంటే..?

Visitors Are Also Reading