టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించి ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవల్ గుర్తింపు పొందారు. ఇక తరువాత దర్శకుడు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తొలుత కొరటాల శివతో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్.
కొరటాల సినిమా మరింత ఆలస్యం అవ్వడంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి హాలీడే వెకేషన్ వెళ్లారు. ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి ఇంగ్లాండ్ వెకేషన్ లో ఉండగా.. ఆయన అక్కడ తన భార్యతో కలిసి ఓ క్యూట్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. చుట్టూ పచ్చదనం మధ్యలో ఎన్టీఆర్ ప్రణతి ఎదురెదురు ఒక బల్లపై కూర్చుని కాపీ తాగుతూ ఉన్నటువంటి ఫోటో షేర్ చేసి.. ఇలాంటి క్షణాలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ ఫోటో షేర్ చేసిన కొద్ది సేపటికే తన అత్తయ్య ఉమామహేశ్వరి మృతి చెందారు.
Advertisement
Advertisement
వాస్తవానికి తన అత్తయ్య మరణించిన విషయం అప్పటివరకు ఎన్టీఆర్ కి తెలియదు. కొందరూ ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ మేనత్త చనిపోతే అక్కడ ఎంజాయ్ చేస్తున్నారంటూ ఎన్టీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే ఇంగ్లాండ్ నుంచి ఇండియా బయలు దేరారు ఎన్టీఆర్. వ్యక్తిగతంగా ఎన్టీఆర్ కు తన అత్తయ్య ఉమామహేశ్వరి అంటే ప్రాణం. ఎన్టీఆర్ వివాహంలో ప్రధానంగా ఉమామహేశ్వరి మేనత్త చేయాల్సిన కార్యక్రమాలన్నింటిని పూర్తి చేశారు. దగ్గర ఉండి తన బాధ్యతలను నిర్వహించడంలో ఎన్టీఆర్ కి ఈమె అంటే ఎనలేని అభిమానం. ఉమామహేశ్వరి మరణవార్త తెలిసిన వెంటనే భారత్ కి బయలుదేరారు.
Also Read :
చిన్న వయసులోనే మరణించిన 5గురు స్టార్ హీరోయిన్స్.. ఒక నటి మరణం గురించి తెలిస్తే కన్నీరు పెడతారు..!!
ఆ ముగ్గురు హీరోల మధ్య “బ్రాండ్స్” పోటీ..అసలు విషయం తెలిస్తే..!!