Home » చిన్న వయసులోనే మరణించిన 5గురు స్టార్ హీరోయిన్స్.. ఒక నటి మరణం గురించి తెలిస్తే కన్నీరు పెడతారు..!!

చిన్న వయసులోనే మరణించిన 5గురు స్టార్ హీరోయిన్స్.. ఒక నటి మరణం గురించి తెలిస్తే కన్నీరు పెడతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

వెండితెరపై ఆడిపాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కొందరు నటీనటులు మన మధ్య లేరు అంటే కాస్త బాధగానే ఉంటుంది. ఇందులో కొంతమంది నటీ నటులు మాత్రం చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధాకరం. మరి చిన్న వయసులోనే ప్రాణాలు విడిచిన ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం..

మహానటి సావిత్రి :

Advertisement

ఈవిడ తన అసమాన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూశారు అంటే ఆమె నటనకు ఎంత ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంతో పేరు తెచ్చుకొని వ్యక్తిగత సమస్యలతో 46 ఏళ్ల వయసులోనే మరణించారు.

దివ్యభారతి:


బొబ్బిలి రాజా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన దివ్యభారతి. చిరంజీవి బాలకృష్ణ, వెంకటేష్, మరికొంతమంది స్టార్ హీరోలతో నటించింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తరువాత 19 ఏళ్ల వయసులోనే అనుమానాస్పదంగా మృతి చెందింది

సౌందర్య:

Advertisement


ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సౌందర్య అంటే ఒక స్టార్ హీరోయిన్ గానే కాకుండా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె అన్ని భాషల్లో కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది. 33 ఏళ్ల వయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.

ఆర్తి అగర్వాల్ :

నువ్వు నాకు నచ్చావ్ మూవీ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఆర్తి అగర్వాల్. ఈమె కేవలం 31 ఏళ్ల వయసులోనే మరణించింది.

సిల్క్ స్మిత :

అప్పట్లో ఈమె సినిమా వస్తుంది అంటే కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించి, నిర్మాతగా చేసి నష్టాల పాలయింది. కేవలం 35 ఏళ్ల వయసులోనే మరణించింది.

ALSO READ:

Visitors Are Also Reading