శ్రీకృష్ణుడి గురించి తెలియని వారుండరు. శ్రావణమాసంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీ శ్రీకృష్ణ జన్మష్టమి. శ్రీకృష్ణుడు అష్టమి రోజు జన్మించాడు కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి అని పిలుస్తారు. శ్రీకృష్ణుడి జన్మ గురించి అందరికీ తెలుసు. కానీ అతని మరణం గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శ్రీకృష్ణుడు తపోవనంలో తపస్సు చేస్తుండగా అక్కడి ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం వదిలాడట. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. అయితే అందుబాటులో బలరాముడు కూడా లేడట. సమత్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమాన్ని అర్జునుడే జరిపించాడు. ఇక ఆ కార్యక్రమం ముగిసిన తరువాత అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్తను నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం వచ్చాడట. ఇక తపోవనమంతా వెతికాడు. దాదాపు రెండు రోజుల పాటు కాళ్లు అరిగేలా తిరిగాడు. అలా వెతకగా వెతకగా.. మొత్తానికి శ్రీకృష్ణుడు ఒక చోట కనిపించాడు. కానీ ప్రాణం లేకుండా కనిపించడంతో అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలిపోయి రోధించాడు. అది శ్రీకృష్ణుడి కళేబరం కాదని నమ్మాలనుకున్నాడు. అర్జునుడితో పాటు ఉన్న రథసారధి, ఇద్దరు ముగ్గురు మాత్రమే అర్జునుడిని ఓదార్చారు.
Advertisement
Advertisement
ఇక అప్పటికే శ్రీ కృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల తనదేహాన్ని వదిలేసి 4-5రోజులు గడిచింది. ఇక ఆ మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్లే వీలు లేక అక్కడే అర్జునుడు ఒక్కడే అరగంటలో ఏ ఆర్భాటం ఏ శాస్త్రం లేకుండా అంత్యక్రియలు పూర్తి చేశాడు. అష్టభార్యలు, 80 మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలడం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులు ఉన్నా వారి చేతుల మీదుగా అంత్యక్రియలు జరుగలేదు. అంతటి ఇతిహాస పురుషులకే అటువంటి అంతిమ ఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కాలక్రమంలో సందేశాలు, మార్గనిర్దేశకాలు అవుతాయనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ అనే చెప్పాలి. మనందరం కాల గమనంలో కొట్టుకుపోయే వాళ్లమే ఆ కాలం అనేది ఎప్పుడు ఎవ్వరికి ఎలా శిక్ష నిర్ణయిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. సర్వేజనా సుఖినోభవంతు. ఇది శ్రీకృష్ణుడి యొక్క మరణ రహస్యం.
Also Read :
అప్పటి ఎన్టీఆర్, చిరంజీవి మాదిరిగా ఇప్పటి తరం నెంబర్ వన్ హీరో ఎవరంటే..?