Home » భారత ప్లేయర్స్ కిట్స్ ఆలస్యం.. మ్యాచ్ కూడా..?

భారత ప్లేయర్స్ కిట్స్ ఆలస్యం.. మ్యాచ్ కూడా..?

by Azhar
Ad

భారత జట్టు ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటన అనేది ముగిసిన తర్వాత శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వన్డే సిరీస్ లో తలపడటానికి విండీస్ వెళ్ళింది టీం ఇండియా. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను క్లిన్ స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో పోటీ పడుతుంది. ఇక ఇందులో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్ లో కూడా భారత జట్టు అనేది గెలిచింది.

Advertisement

అందువల్ల ఈ సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలోకి వెళ్లిన టీం ఇండియా ఈరోజు కరేబియన్ జట్టుతో రెండో టీ20 అనేది ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ లు అన్ని కూడా మన ఇండియా టైం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి. కానీ ఈరోజు జరగాల్సిన మ్యాచ్ మాత్రం రాత్రి 10 గంటలకు ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ఇక అందుకు కారణం తెలిసిన తర్వాత మాత్రం అందరూ నవ్వుకుంటున్నారు.

Advertisement

అయితే ఈ సిరీస్ కోసం మన టీం ఇండియా విండీస్ లోని ట్రిడినాడ్ లో బస చేస్తుంది. ఇక అయితే ఈ రెండో టీ20 కోసం అక్కడి నుండి గ్రౌండ్ కు మన ఆటగాళ్లు చేరుకున్నారు. కానీ వారి క్రికెట్ కిట్స్ అనేవి రాలేదు. అవి రావడానికి ఇంకా రెండు గంటల సమయం పడుతుంది అని తెలిపారు. అందుకే లెక్క ప్రకారం 8 గంటలకు జరగాల్సిన మ్యాచ్ ను రెండు గంటలు వాయిదా వేసి 10 గంటలకు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

రోహిత్ కంటే దినేష్ గ్రేట్.. ఎలా అంటే..?

ధోనీ, కోహ్లీ రికార్డులపై మహిళా ప్లేయర్స్ ఆధిపత్యం..!

Visitors Are Also Reading