Home » పాకిస్థాన్ ప్రపంచ కప్ గెలవలేదు…!

పాకిస్థాన్ ప్రపంచ కప్ గెలవలేదు…!

by Azhar

ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనుంది. అయితే ఇప్పుడు ఈ టోర్నీకి సమయం అనేది దగ్గరకు వస్తున్న తరుణంలో ఇందులో ఎవరు విజయం సాధిస్తారు.. అనేది పెద్ద చర్చగా మారింది. అయితే తాజాగా ఈ విషయంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన అభిప్రయం అనేది చెప్పాడు. ఇందులో ఎవరు విజయం సాధిస్తారు అనేది చెప్పేముందు ఎవరు గెలవలేరు అనే విషయంలో కొన్ని ముఖ్యమైన కామెంట్స్ అనేవి చేసాడు పాంటింగ్. అందులోనే పాకిస్థాన్ ప్రపంచ కప్ గెలవలేదు అని కుండా బద్దలు కొట్టాడు.

తాజాగా ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయింటింగ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఈ మెగా టోర్నీలో విజయం సాధించలేదు అని అన్నాడు. ఎందుకంటే… ఆ జట్టు మొత్తం ఎప్పుడు కెప్టెన్ బాబర్ ఆజాం పైనే ఆధారపడుతుంది. అతను అదైతేనే జట్టు గెలుస్తుంది. లేదంటే లేదు. నేను గతంలో కూడా చెప్పను బాబర్ గొప్ప ఆటగాడు అని. కానీ క్రికెట్ అనేది టీం గేమ్. ఒక్కడు ఆడితే ఒక్క మ్యాచ్ రెండు మ్యాచ్ లలో గెలవచ్చు. కానీ ప్రపంచం కప్ గెలవలేం అని పేర్కొన్నాడు. అందుకే ఈ టైటిల్ రేస్ లో పాకిస్థాన్ లేదు అని పేర్కొన్నాడు.

ఇక అదే విధంగా ఈ టోర్నీలో ఫైనల్స్ కు వేళ్ళ జట్ల గురించి మాట్లాడిన పాంటింగ్.. ఫైనల్స్ రెండు భర్తులు అనేవి ఆస్ట్రేలియా, ఇండియా సాధిస్తాయి అని చెప్పాడు. కానీ ఆ ఫైనల్స్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఇండియాను ఓడిస్తుంది అని అన్నాడు. ఎందుకంటే.. ఆసీస్ కు హోమ్ గ్రౌండ్ అనే అడ్వాంటేజ్ అనేది పని చేస్తుంది అని అన్నాడు. అయితే ఈ ఆసీస్, భారత్ తో పాటుగా ఇంగ్లాండ్ జట్టు కూడా బలంగానే కనిపిస్తుంది అని చెప్పాడు. కానీ ఆ జట్టు ఫైనల్స్ కు వస్తుంది అని మాత్రం పాంటింగ్ చెప్పలేదు.

ఇవి కూడా చదవండి :

మురళి విజయ్ కు బుద్ధి చెప్పిన ఫ్యాన్స్..!

కామన్వెల్త్ గేమ్స్ నుండి తప్పుకున్న నీరజ్ చోప్రా..!

Visitors Are Also Reading