Home » ఈ 12 రాశుల్లో ఏ రాశుల వారు ఎవరెవ‌రికీ దూరంగా ఉండాలో తెలుసుకోండి.. లేకపోతే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు

ఈ 12 రాశుల్లో ఏ రాశుల వారు ఎవరెవ‌రికీ దూరంగా ఉండాలో తెలుసుకోండి.. లేకపోతే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు

by Anji
Ad

ప్ర‌తి మ‌నిషిలో లోపాలు చాలానే ఉంటాయి. పొర‌పాట్లు చేయ‌ని వారుండ‌రు. ప్ర‌తీ ఒక్క‌రూ చేస్తుంటారు. అంత‌మాత్రాన వారు మంచి వ్య‌క్తులు కాద‌ని.. ఓ అభిప్రాయానికి రాలేం. అయితే లోప‌ల విషాన్ని పెట్టుకొని బ‌య‌ట‌కు ఎంతో మంచిగా మ‌న‌కు సాయం చేస్తున్న‌ట్టుగా న‌టించే వాళ్ల‌ని అంచ‌నా వేయ‌డం చాలా క‌ష్టం. అలా కొంద‌రూ మ‌న జీవితంలోకి అడుగుపెట్టి మ‌న జీవితాన్ని మార్చేస్తారు. మ‌న‌ల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తారు. ఇలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండేందుకు ప్ర‌య‌త్నించాలి. ఈ రాశి చ‌క్రం ఆధారంగా ఏ రాశుల వారు ఎవ‌రెవ‌రికీ దూరంగా ఉండాలో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

మేష రాశి :

Advertisement

ఈ రాశి వారు మొండి ప‌ట్ట‌ద‌ల‌ను క‌లిగి ఉంటారు. కొన్ని సార్లు ఆధిపత్యం చెలాయించాల‌ని చూస్తుంటారు. ఇది వారిలో ఉండే చెడు లక్ష‌ణం. పూర్తిగా అన్ని వివ‌రాలు తెలియ‌నిదే ఏ ఒక్క‌రినీ చెడుగా ప‌రిగ‌నించ‌లేం. వీలైనంత వ‌రకు మేష‌రాశి వారు వృష‌భ రాశి వారికి దూరంగా ఉంటే మంచిది.

వృష‌భ రాశి :

ఈ రాశి వారు త‌మ జీవితంలో ప్ర‌తిదీ ఓ క్ర‌మంలో ఉండాల‌ని అనుకుంటారు. కానీ ధ‌న‌స్సు రాశి వారు వీరి జీవితంలో వ‌చ్చిన త‌రువాత వీరికి అన్ని ప‌నుల్లోనూ ఆటంకాలు ఎదుర‌వుతాయి. ముఖ్యంగా ఇందులో చ‌ట్ట‌విరుద్ధ‌మైన ప‌నులు కూడా ఉండ‌వ‌చ్చు. వారి విష‌పూరిత‌మైన స్వ‌భావం వృష‌భ రాశి వారిని ప్ర‌భావితం చేస్తుంది. అందుకే ఈ రెండు రాశుల వారు దూరంగా ఉంటే మంచిది.

మిథున రాశి :

మిథున‌రాశి వారు స్వేచ్చగా ఉండాల‌నుకుంటారు. కానీ కుంభ‌రాశి వారి వ‌ల్ల వీరు గంద‌ర‌గోళానికి గుర‌వుతారు. ఇది వారి ఆలోచ‌న నైపుణ్యాల‌ను చెడు మార్గంలో దిగ‌జార్చుతుంది. ఈ రెండు శ‌క్తి మంత‌మైన రాశులు క‌లిసి ఉన్న‌ప్పుడు తేడా స్ప‌ష్టంగా తెలుస్తోంది. వీరిద్ద‌రూ ప‌నుల‌పై నిర్లక్ష్యం చూపుతారు. ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేసిన‌ప్పుడు వారిని ఇబ్బందుల్లోకి ప‌డేస్తుంది.

క‌ర్కాట‌క రాశి :

 

క‌ర్కాట‌క రాశి నిపుణులు చాలా సున్నిత‌మైన వారు. వారు అభ‌ద్ర‌త ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల బాద‌ప‌డుతున్నారు. కానీ వారి భావోద్వేగాలు సున్నిత‌త్వం కార‌ణంగా క‌ర్కాట‌క రాశి వారికి ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

సింహ‌రాశి :

సింహ రాశి వారు త‌ప్పులు తొంద‌ర‌గా చేసేస్తారు. కానీ త‌మ త‌ప్పును త్వ‌ర‌గా తెలుసుకుంటారు. మ‌క‌ర రాశి అహంకార ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల సింహ‌రాశి వారికి ఇబ్బంది క‌లుగుతుంది. ఇది సింహ‌ రాశి వారికి భారంగా ఉంటుంది.

Advertisement

క‌న్య‌రాశి :

విమ‌ర్శ‌నాత్మ‌క ధోర‌ణిని క‌లిగి ఉండే క‌న్య‌రాశి వారికి మీన రాశి వారి నుంచి ఇబ్బంది క‌లుగుతుంది. విభిన్న వ్య‌క్తిత్వాలు ఇద్ద‌రి మ‌ధ్య జ‌గ‌డాల‌కు కార‌ణం అవుతుంది. ఈరెండు రాశుల వారి మ‌ధ్య ఎప్పుడూ సంఘ‌ర్ష‌ణ త‌లెత్తుతుంది.

తుల‌రాశి :

తుల‌రాశి వారికి వీరి రాశి వారితోనే ఇబ్బంది త‌లెత్త‌వ‌చ్చు. ఈ రాశి ప్ర‌జ‌లు ఒక‌రినొక‌రు విష‌పూరితంగా భావిస్తారు. జీవిత‌కాలం వారిని ఇబ్బందికి గురి చేస్తాయి. వీరి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల్లో ఇత‌రుల‌ను కూడా దూర‌నివ్వ‌రు.

వృశ్చిక రాశి :

వృశ్చిక రాశి వారు సున్నిత మ‌న‌స్త‌త్వం గ‌ల వారు. ఇదే స‌మ‌యంలో శ‌క్తిమంతంగా ఉంటారు. అయితే మేష‌రాశి వారితో ఇబ్బంది ఉండ‌వ‌చ్చు. వీరిద్ద‌రి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ ఎక్కువ‌గా ఉంటుంది.

ధ‌న‌స్సు రాశి :

ధ‌న‌స్సు రాశి వారికి సున్నిత మన‌స్థ‌త్వం గ‌ల క‌ర్కాట‌క రాశి వారితో ఇబ్బంది ఏర్ప‌డుతుంది. వీరు కేర్ లెస్ గా ఉంటారు. క‌ర్కాట‌క రాశి వారు వీరి ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల మూడీగా త‌యార‌వుతారు. దీంతో ఫ్ర‌స్టేటెడ్ గా ఫీల్ అయ్యే ప్ర‌మాదం ఉంది.

మ‌క‌ర రాశి :

మ‌క‌ర రాశి వారు వృశ్చిక రాశి వారితో అన్యోన్యంగా ఉండలేరు. వీరు ఉద్రేక పూరిత‌మైన వారు. ఇత‌రుల ప‌ట్ల ఎమోస‌న్స్ ని స‌రిగ్గా చూపించ‌లేరు. ఇదే రెండు రాశుల మ‌ధ్య ఇబ్బందిని పెంచుతుంది.

కుంభ‌రాశి :

కుంభ రాశి ప్ర‌జ‌లు స్వేచ్ఛ- ఉత్సాహ‌భ‌రిత‌మైన వ్య‌క్తిత్వం క‌లిగి ఉంటారు. వీరి ధోర‌ణి సింహ‌రాశి వారికి అస్స‌లు న‌చ్చ‌దు. అందుకే సింహ‌రాశి వారితో ఉండేందుకు వీరు చాలా ఇబ్బంది ప‌డ‌తారు.

మీన రాశి :

మీన రాశి వారు ప్రేమ‌, అనురాగం ఎక్కువ‌గా కోరుకుంటారు. ఎవ‌రైనా వీరిని ఇబ్బంది పెడితే మాత్రం వీరు బాధ‌ప‌డ‌తారు. వీరిని ఇలా ఇబ్బంది పెట్టే వారిలో క‌న్యారాశి వారు ముందుంటారు. వీరికి క‌న్యారాశి వారంటే అస్స‌లు ఇష్టం ఉండ‌దు. ఫ‌లితంగా ఈ రెండు రాశుల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది.

Also Read  :

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త వ‌హించాలి

Visitors Are Also Reading