తెలుగు బుల్లితెరపై గత కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ షో మీద, అందులో ఇది వరకు చేసి బయటకు వచ్చినా కమెడియన్స్ మీద అనేక విమర్శలు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. జబర్దస్త్ గురించి కమెడియన్స్ లో ఏ కమెడియన్ ఇంటర్వ్యూ ఇచ్చినా అది చాలా ఆసక్తికరంగా మారుతోంది. అయితే జబర్దస్త్ లో చాలా మంది అభిమానులు ఇష్టపడే కాంబినేషన్ సుడిగాలి సుధీర్ రష్మీ. వీరి కెమిస్ట్రీ తో ఆ షోను ఎక్కడికో తీసుకెళ్లారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
Advertisement
మరి వారిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందా, మరి వారి రిలేషన్ అసలు ఏ విధంగా ఉంది అనే ప్రశ్నలు చాలామందిలో మెదులుతున్నాయి. వీరి బంధంపై గెటప్ శ్రీను క్లారిటీ ఇచ్చాడు. సుధీర్ -రష్మీ ల మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని వాళ్ళిద్దరూ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే ఫాలో అవుతారని, అక్కడి నుంచి బయటకు వచ్చాక ఎవరి లైఫ్ వాళ్ళది అని అన్నారు. జబర్దస్త్ ను విడిచి బయటకు వెళ్ళడానికి ప్రధాన కారణం సినిమా అవకాశాలే అని చెప్పేశారు.. జబర్దస్త్ తో పాటుగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కూడా మేము చేస్తూ వచ్చాం.
Advertisement
ఈ రెండు షూటింగులు వరుసగా ఉండటంతో నేను టీం లీడర్ గా వచ్చినప్పుడు రాంప్రసాద్ కు నాలుగు స్క్రిప్టులు రాయాల్సి ఉంది. దీనివల్ల స్క్రిప్ట్ లో క్వాలిటీ తగ్గుతోందని, టీమ్ లీడర్ నుంచి తప్పుకున్నాను. సినిమా అవకాశాలు రావడం వల్లే జబర్దస్త్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే జబర్దస్త్ గురించి చాలామంది పలు విధాలుగా మాట్లాడుతున్నారు కానీ వారు చాలా కార్యక్రమాలకు డొనేషన్స్ ఇస్తారని, మాలో ఎవరికైనా కష్టం వస్తే అందరం కలిసి పంచుకునే వాళ్ళమని ఇవన్నీ బయటకు రావని తెలియజేశారు.
ALSO READ;
అల్లు రామలింగయ్య నుండి సాయిపల్లవి వరకు.. టాలీవుడ్ లో డాక్టర్లు గా కొనసాగుతున్న యాక్టర్లు.. ఎవరంటే..?
బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్.. అది ఏంటో తెలిస్తే మీరు షాకవుతారు..!!