Telugu News » Blog » అల్లు రామలింగయ్య నుండి సాయిపల్లవి వరకు.. టాలీవుడ్ లో డాక్టర్లు గా కొనసాగుతున్న యాక్టర్లు.. ఎవరంటే..?

అల్లు రామలింగయ్య నుండి సాయిపల్లవి వరకు.. టాలీవుడ్ లో డాక్టర్లు గా కొనసాగుతున్న యాక్టర్లు.. ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

మనం దేవుడి తర్వాత, ప్రత్యక్షదైవంగా కనిపించే దేవుడని నమ్మేది డాక్టర్లను మాత్రమే. ఈ డాక్టర్ల గురించి మనం సినిమాల్లో కానీ బయట కానీ చాలా విషయాలు విని ఉంటాం. డాక్టర్ లేకపోతే ఈ సమాజంలో ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసేవి. కరోణ సమయంలో వారు చేసిన కృషి అంతా ఇంతా కాదు. మాటల్లో చెప్పలేం. ప్రస్తుత కాలంలో చాలా మంది యువత డాక్టర్ కావాలని కోరుకోవడం లేదు, దీనికి కారణం అది ఏళ్ళకు ఏళ్ళు చదువు ఉంటుంది, దీనితో పాటుగా ప్రాక్టీస్ ఉంటుంది. అందుకోసమే చాలామంది డాక్టర్ కోర్సు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.

Ads

ఎందుకంటే డాక్టర్ వృత్తి లోకి వచ్చాక వారికి వేరే ప్రపంచం ఉండదు. అంతటి మహోన్నతమైన వృత్తి డాక్టర్ వృత్తి. అయితే ఈ డాక్టర్ వృత్తిని వదిలి మన టాలీవుడ్ లోకి వచ్చిన చాలా మంది పెద్దపెద్ద యాక్టర్స్ గా మారారు. ఇందులో కొంత మంది ఇప్పటికీ డాక్టర్లుగా చేస్తూనే మరోపక్క నటన కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. అల్లు రామలింగయ్య నుండి ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి వరకు ఎంతో మంది డాక్టర్లు వృత్తిని చేసినవారే, మరి అలాంటి వారు ఎవరు ఓ సారి చూద్దాం..?
అల్లు రామలింగయ్య :
అల్లు రామలింగయ్య ఆయుర్వేద వైద్యంలో మంచి నిష్ణాతుడు. ఆయన ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఈ వృత్తిని కొనసాగించారు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు.


సాయి పల్లవి :
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. ఇండస్ట్రీలో లేడీ పవన్ కళ్యాణ్ గా గుర్తింపు పొందిన ఈమె, తన పాత్రల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఈ అమ్మడు కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసి, సినిమాల్లో చేస్తోంది.

రాజశేఖర్ :
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తెలుగు వెలిగిన రాజశేఖర్, గతంలో ఎన్నో సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టారు. హీరో రాజశేఖర్ కూడా చాలా పెద్ద డాక్టర్. రాజశేఖర్ హస్తవాసి మంచిదని ఒకానొక సందర్భంలో సునీల్ చెప్పుకొచ్చారు. ఓవైపు నటన కొనసాగిస్తూనే డాక్టర్ వృత్తి చేసుకుంటూ వచ్చారు ఆయన.

భరత్ రెడ్డి:
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న భరత్ రెడ్డి కూడా డాక్టర్ అని చాలా మందికి తెలియదు. యాక్టింగ్ పై ఉన్న ఇష్టంతో ఆయన డాక్టర్ వృత్తి చేస్తూ యాక్టర్ గా పలు సినిమాల్లో నటిస్తున్నారు.

Ads


భద్రం:
మహానుభావుడు, ప్రతి రోజు పండగే, భలే భలే మగాడివోయ్ సినిమాల్లో మంచి కమెడియన్ గా నటించిన భద్రం కూడా డాక్టరే.

ప్రభాకర్ రెడ్డి :
ఒకప్పుడు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ రెడ్డి మెడిసిన్ కంప్లీట్ చేశాడు. తర్వాత నటనపై మోజుతో ఇండస్ట్రీలోకి వచ్చాడు.

శివాని రాజశేఖర్ :
తండ్రి బాటలోనే వస్తున్న రాజశేఖర్ కూతురు శివాని కూడా మెడిసిన్ కంప్లీట్ చేసింది.

నివేద థామస్ :
ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న నివేద థామస్, డాక్టర్ కోర్సు పూర్తి చేసింది. నటనతో పాటుగా మరో పక్క ప్రాక్టీస్ కూడా చేస్తోంది.

రూప కొడువాయుర్ :
వెంకటేశ్ మహా డైరెక్షన్ లో సత్యదేవ్ హీరోగా చేసిన సినిమాలో నటించింది రూపా. ఈమె కూడా మెడిసిన్ పూర్తిచేసింది.

అజ్మల్ అమీర్ :
రంగం అనే మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అమీర్, రచ్చ,అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాల్లో నటించారు. ఈయన కూడా మెడిసిన్ పూర్తి చేశారు.

A;SO READ;

కెరీర్ ప్రారంభంలోనే ఒకే ఏడాది హ్యాట్రిక్ హిట్ కొట్టిన‌ నంద‌మూరి హీరో ఎవ‌రో తెలుసా..?

Ad

24 ఇడ్లీలు, 30బ‌జ్జీలు…ఎన్టీఆర్ ఫుడ్ మెనూ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!