మనం సంతోషం వచ్చినప్పుడు అందరితో పంచుకున్నట్లే, అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా మన దగ్గర ఎవరైతే ఉంటారో వారీతో షేర్ చేసుకుంటాం. ఇలాంటి విషయాలను షేర్ చేసుకుంటే ఏం కాదు కానీ, ఈ 4 విషయాలను ఎవరితో చెప్పుకోకూడదు.. అవేంటో ఒకసారి చూద్దాం..?
1.భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను మూడో వ్యక్తితో పంచుకోవడం మంచిది కాదు. దీనివల్ల మీ భార్య, భర్తల మధ్య ఆ చిన్న రహస్యాలనేవి వారికి తెలిస్తే దానివల్ల మీ సంసార జీవితంలో వారు కూడా వేలు పెట్టే అవకాశం ఉంటుంది.
Advertisement
2. జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని ఇతరులతో చెప్పాలి తప్ప అందులో ఉన్నటువంటి గోప్యమైన విషయాలను అన్నింటినీ వారికి చెప్పకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు లక్ష్యాన్ని సాధించలేకపోతే ఇతరుల నుంచి చాలా భిన్నమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు.
Advertisement
3. మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు. మనం కుడిచేత్తో సహాయం చేసింది ఎడమచేతికీ కూడా తెలియ నీవ్వద్దు అంటారు. మీరు ఎవరికైనా అనుకోకుండా కానీ ఆపదలో సహాయం చేసిన దాని గురించి ఎవరికీ చెప్పకూడదు. మీరు సహాయం చేసిన విషయాన్ని బయటకు చెబితే, ప్రతికూల విమర్శల్ని ఎదుర్కోవచ్చు.
4. మన జీవిత అవసరాల కోసం ముందుగానే పొదుపు చేసుకుని బ్యాంకులో సేవ్ చేసుకున్న డబ్బు గురించి కానీ, బ్యాంకు వివరాల గురించి కానీ ఎప్పుడు కూడా ఇతరులతో పంచుకోవద్దు. అది మీ పై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
also read:
- ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఈ యాక్టర్స్ అందరు చనిపోయారని తెలుసా ? వారికి అదే శాపమా ?
- రోడ్డు పై వాహనాలను ఆపుతున్న శ్రీరెడ్డి…ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!