తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను రెండు కళ్లుగా చెబుతుంటారు. అయితే ఇందులో ఇటు సినిమా పరంగాను.. అటు రాజకీయ పరంగాను ప్రజల్లో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. అప్పట్లో కథతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ సినిమా అంటే చాలు జనం ఎగబడి మరి సినిమాను చూసేవారు. ఇలా తెలుగులో మొదటి స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ కు అలనాటి అందాల తార శ్రీదేవి కాంబినేషన్ స్క్రీన్ పైన ఎంత సూపర్ హిట్ అనేది అందరికి తెలిసిన విషయమే. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు చాలానే సూపర్ హిట్ అయ్యాయి.
Advertisement
కానీ ఎన్టీఆర్ తన ఒక్క సూపర్ హిట్ సినిమాలో మాత్రం శ్రీదేవిని వద్దు అని చెప్పారట. ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాల లిస్ట్ లో ముందు వరుసలో ఉంటుంది ఆరాధనా సినిమా. ఈ సినిమా కథ పరంగాను.. పాటల పరంగాను… ఎమోషన్ పరంగాను అభిమానులను కట్టిపడేస్తుంది. ఈ సినిమాలో అన్ని పాటలు అప్పటి స్టార్ సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు పడాల్సింది. కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ కు బాలుగారికి చిన్న విబేధాలు రావడంతో హిందీ సింగర్ మహమ్మద్ రఫీతో పాటలు పాడించారు. అవి కాస్త సినిమాకు హైలెట్ గా నిలిచాయి.
Advertisement
అయితే హీరోయిన్స్ విషయంలో కూడా ఇలానే జరిగింది. మొదట ఈ సినిమాలో జయప్రదను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత శ్రీదేవికి ఎన్టీఆర్ గా జంటగా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇందులో శ్రీదేవిని వద్దని.. వాణిశ్రీని హీరోయిన్ గా ఎంపిక చేసారు. వాణిశ్రీ గత సినిమాలో ఆమె నటనను చుసిన ఎన్టీఆర్ మెచ్చి.. ఈ సినిమాలో ఆమె అయితేనే ఆ పాత్రకు బాగుంటుంది అని అనుకున్నారట. దాంతో ఇందులో ఎన్టీఆర్ కు వాణిశ్రీ జత కట్టింది. ఇక సినిమా విడుదలైన తర్వాత సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ఎన్టీఆర్ – వాణిశ్రీ జంట కూడా అభిమానులకు బాగా నచ్చింది.
ఇవి కూడా చదవండి :