టాలీవుడ్ అగ్రహీరోయిన్లలో పూజా హెగ్దే ఒకరు. ఈమె తొలిసారి ముకుంద సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా విడుదల అవ్వడంలో ఆలస్యం కావడంతో ఆ వెంటనే అక్కినేని హీరో నాగచైతన్యతో నటించిన ఒక లైలా కోసం సినిమాతో ఈమె తెలుగు తెరకు పరిచయమైందనే చెప్పాలి. అనతి కాలంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్లు అందుకున్న ఈ భామ ఇప్పుడు హీరోయిన్‌గా మారింది. ఓ వైపు తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా ఈమె హవా బాగానే నడుస్తుంది.
Advertisement
ఈమె చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న పూజా హెగ్దే పై కొంతకాలంగా ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతుంది. బీస్ట్ సినిమా షూటింగ్ సమయంలో పూజా హెగ్దే స్టాఫ్‌నకు సంబంధించి ఖర్చులు భారీ గా వచ్చాయట. కేవలం వీరి ఫుడ్ కోసమే లక్షల్లో బిల్లు అయిందట. ఇటీవల వీటికి సంబంధించిన బిల్లులు బీస్ట్ నిర్మాతలకు అందాయి. అయితే ఆ బిల్లు చూసిన నిర్మాతలు ఒక్కసారిగా కంగుతిన్నట్టు సమాచారం. ఇప్పటికే బీస్ట్ మూవీ డిజాస్టర్ తో భారీ నష్టాల్లో ఉన్న నిర్మాతలు పూజా, ఆమె స్టాఫ్‌నకు అయిన ఖర్చులు మరింత భారమయ్యాయట.
Advertisement
అయితే పూజా హెగ్దే చేసిన ఖర్చులు తానే చెల్లించాలని బిల్లు పేపర్లను పంపి షాక్ ఇచ్చారట నిర్మాతలు. గతంలో కూడా పూజా నిర్మాతలకు మరింత భారమయ్యేవిధంగా వ్యవహరించిందని ఓ దర్శకుడు కామెంట్ చేసిన విషయం విధితమే. తాను మాత్రమే కాకుండా తన స్టాఫ్‌ని సైతం షూటింగ్‌కు తీసుకొస్తుందని, వారికి అయ్యే ఖర్చు నిర్మాతలకు భారం కాదా అని ఆ దర్శకుడు పేర్కొన్నాడు. రాబోయే రోజుల్లో అయినా పూజాహెగ్దే తన పంథాను మార్చుకుంటుందో లేదో అనేది చూడాలి. ప్రస్తుతం పూజాహెగ్దే పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించనున్నది.
Also Read :
టాలీవుడ్ ఇండస్ట్రీలో వస్తున్న రూమర్స్‌పై స్పందించిన నరేష్..!
అనిల్ రావిపూడి F2 సినిమాలో ఈ సీన్స్ పెట్టడానికి కారణం ఏంటో తెలుసా ?