పరిశ్రమలపై ఏపీ సర్కార్ ఫోకస్ పెంచింది. నేడు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అమెరికాలో తెలంగాణ యువకుడిని కాల్చిచంపారు. నల్లగొండకు చెందిన నక్కా సాయి కుమార్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం కారులో ఆఫీస్ కు వెళుతుండగా నల్ల జాతీయులు తుపాకీతో కాల్చారు.
Advertisement
ఈ రోజు నుంచి షూటింగ్ ల బంద్ కు తెలుగు ఫిలిం ఫెడరేషన్ పిలుపునిచ్చింది. సినీ కార్మికులు నేడు షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. సినీకార్మికులు కృష్ణానగర్ లోని తమ యూనియన్ ఆఫీస్ లకు చేరుకుంటున్నారు. ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సులు ఇతర వాహనాలను ఫెడరేషన్ సభ్యులు నిలిపేశారు.
రైల్వే స్టేషన్ లో రూ. 78 లక్షల హవాలా డబ్బును సీజ్ చేశారు. బంగారం కొనడానికి ఎటువంటి పత్రాలు లేకుండా డబ్బులు తరలిస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో విజయవాడకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
Advertisement
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసింది. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.
సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్ న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు.
గన్నవరం ఎమ్మెల్యే వంశీ తీవ్రఅస్వస్తతకు గురయ్యారు. ఎడమచేయి లాగటంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని రేపు డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు.
నేడు మద్యాహ్నం 12 30నిమిషాలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏపీ విద్యాశాఖామంత్రి బొత్ససత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు.
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 403 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది. కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీచేసింది.