Home » వైజాగ్ బీచ్ లో భారత ఆటగాళ్ల సందడి..!

వైజాగ్ బీచ్ లో భారత ఆటగాళ్ల సందడి..!

by Azhar
Ad
ఇండియా vs సౌత్ ఆఫ్రికా టీ20 ప్రస్తుతం వైజాగ్ కు చేరుకుంది. ఈ రెండు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ వైజాగ్ లోనే జరగనుంది. ఈ క్రమంలోనే తాజాగా భారత ఆటగాళ్లతో పాటుగా సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ కూడా విశాఖను చేరుకున్నారు. ఇక ఇక్కడ రిషికొండ బీచ్ పక్కన ఉంటుంది ఓ హోటల్లోకి వచ్చిన భారత ఆటగాళ్లు అందరూ బీచ్ లో దర్శమిచ్చారు. ఇప్పుడు ఆటగాళ్లకు సంబధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక రేపు సాయంత్రం రెండు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుండగా ఈరోజు సాయంత్రం వైజాగ్ కు చేరుకున్న ఆటగాళ్లు బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆటగాళ్లు అందరూ తమకు ఉన్న ప్రెసర్ ను ఇక్కడ వదిలేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే రేపు ఉదయం స్టేడియంకు చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించనున్న భారత ఆటగాళ్లు ఇలా బీచ్ కు రావడం ఫ్యాన్స్ ను ఆశ్చర్య పరుస్తుంది. అయితే ఇన్ని రోజులు కరోనా కారణంగా బయో బాబుల్ లోనే గడిపిన భారత ఆటగాళ్లకు ఇప్పుడు ఆ కరోనా నియమాలు లేకపోవడంతో ఇలా ఫ్రీగా బయటకు వస్తున్నారు.
అయితే ఇప్పటివరకు ఢిల్లీ, కటక్ వేదికగా జరిగిన రెండు టీ20 మ్యాచ్ లలో భారత్ ఓడిపోయింది. మ్యాచ్ లోకికీలక సమయాల్లో చేసిన కొన్ని తప్పుల వల్లే రెండు మ్యాచ్ లు ఓడిపోయి సిరీస్ ను కష్టాల్లోకి నెట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు భారత జట్టు సిరీస్ నెగ్గాలంటే మిగిలిన మూడు మ్యాచ్ లలో గెలవాల్సిందే. ముఖ్యంగా రేపు జరగనున్న మ్యాచ్ లో గెలిస్తేనే ఆశలు సజీవంగా ఉంటాయి. అందుకే ఈ వైజాగ్ మ్యాచ్ కు ప్రాధాన్యత పెరిగింది. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు ఎప్పుడో వరం పది రోజుల కిందంటే అమ్ముడైపోయాయి.

Advertisement

Visitors Are Also Reading