టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్యంగా గబ్బర్‌సింగ్ సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా మారారనే చెప్పవచ్చు. ఆయన చాలా సినిమాలు తీసినప్పటికీ గబ్బర్‌సింగ్, గద్దలకొండ గణేష్ వంటి చిత్రాలు మంచి పేరును తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆయన భవదీయుడు భగత్‌సింగ్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు దర్శకుడు హరీష్ శంకర్.
Advertisement
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కనున్నది. త్వరలో పట్టాలెక్కనున్న ఈ ప్రెజెక్ట్‌పై ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ఈ చిత్రంలో నటిస్తున్నారని.. ఈ విషయంపై ఇటీవలే దర్శకుడు హరీష్ ముంబై వెళ్లి సల్మాన్‌ను ప్రత్యేకంగా కలిశారని ఓ వెబ్‌సైట్ లో వార్తలు వినిపించాయి. ఈ వార్త కాస్త నెట్టింట వైరల్ కావడంతో హరీష్ శంకర్ కంట పడింది. ఆయన ట్విట్టర్ వేదికగా ఆ వెబ్‌సైట్‌ను ట్యాగ్ చేస్తూ ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు.
Advertisement
ముఖ్యంగా మీడియా సంస్థలు ఏదైనా పోస్ట్ చేసే ముందు నన్ను ఒకసారి సంప్రదించండి. ఏ సమయంలోనైనా నేను అంటుబాటులోనే ఉంటానని సున్నితంగా సమాధానం ఇచ్చారు. అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భవదీయుడు భగత్‌సింగ్ గురించి పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ మాట్లాడారు. సినిమా షూట్ త్వరలోనే ఆరంభించనున్నట్టు కూడా చెప్పారు. ఈ సినిమా గురించి పలువురు పలు రకాలుగా అనుకుంటున్నారని.. వాటిలో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు. సినిమా ప్రకటించి చాలా రోజులు అయినా షూటింగ్ ప్రారంభం కాలేదు అని.. సినిమా ఎప్పుడు వచ్చినా సరే మీరు మళ్లీ మళ్లీ చూసే విధంగా ఉంటుంది. ఇందులో డైలాగ్‌లు, పాటలు పదికాలాల పాటు గుర్తుండేవిధంగా ఉంటాయని దర్శకుడు హరీష్ క్లారిటీ ఇచ్చారు.
Also Read :
ఫేస్‌బుక్‌లో మారనున్న టికర్, లోగో..!
నయనతార విజ్ఞేశ్ శివన్ కు ఇచ్చిన గిఫ్ట్ విలువ ఎంతో తెలిస్తే షాకవుతారు..?