Home » చిలుక జోస్యానికి క‌రీంనగ‌ర్ జిల్లాలోని ఆ గ్రామం చాలా ఫేమ‌స్.. అది ఏ ఊరు అంటే..?

చిలుక జోస్యానికి క‌రీంనగ‌ర్ జిల్లాలోని ఆ గ్రామం చాలా ఫేమ‌స్.. అది ఏ ఊరు అంటే..?

by Anji
Ad

భ‌విష్య‌త్ తెలుసుకోవాల‌నే త‌ప‌న‌, ఆస‌క్తి ప్ర‌తి ఒక్క‌రిలో ఉండ‌డం స‌హ‌జం. ముఖ్యంగా ఏదైనా స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు లేదంటే ఎప్ప‌టి నుంచో చేయాల‌నుకుంటున్న ప‌ని ఆల‌స్యం అవుతున్న సంద‌ర్భాల్లో క‌చ్చితంగా ఎందుకు ఇలా జ‌రుగుతోందనే సందేహం ఉంటుంది. అలాంటి సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు జ్యోతిష్యం చెప్పేవాళ్లు, జాత‌కాలు చూసేవాళ్లు, లేదంటు హ‌స్త‌సాముద్రికం వాస్తు శాస్త్రవేత్త‌ల‌ను సంప్ర‌దిస్తారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని ఆ గ్రామానికి వెళ్లితే.. క‌చ్చిత‌మైన స‌మాధానం వ‌స్తోంద‌ని చాలా మంది న‌మ్ముతుంటారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఆ గ్రామానికి అంత స్పెష‌ల్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


క‌రీంన‌గర్ జిల్లా కొత్త‌ప‌ల్లి మండ‌లం ల‌క్ష్మిపూర్ చిల‌క జోస్యానికి చాలా ఫేమ‌స్ అనే చెప్పాలి. ఆ గ్రామంలో బుడిగ జంగాల కాల‌నీలో దాదాపు 200 కుటుంబాలు చిలక జోస్యం చెప్పుకొని కుటుంబాల‌ను పోషించుకుంటారు. ఇది త‌ర‌త‌రాల నుంచి వారి కుటుంబం వారే ఈ జోస్యం చెబుతూ వస్తున్నారు. చిల‌క జోస్యం చెప్ప‌డం ప్ర‌త్యేక‌త ఏముంది..? చాలా చోట్ల చెబుతారు క‌దా అనే సందేహం ఉంటే దానిని ప‌క్క‌కు పెట్టండి. ఎందుకు అంటే ఇక్క‌డ జోస్యం చెప్పే వారు 200 ఏళ్ల నుంచి 200 కుటుంబాల అదే విద్య‌ను ఉపాధిగా మార్చుకుని జీవిస్తున్నారంటే వారి జోస్యంపై ఎంతో న‌మ్మ‌కం ఉండ‌డం వ‌ల్ల‌నే ఇంత మంచి పేరు వ‌చ్చింద‌ని చుట్టు ప‌క్క‌ల జ‌నాలు న‌మ్ముతున్నారు.

Advertisement

Advertisement


ఇక మ‌న‌కు క‌నిపించే చిల‌క జోస్యం చెప్పే వాళ్లందిరిలా కాకుండా ల‌క్ష్మీపురంలో ఉండే వారు జాత‌కం కార్డు తీసే చిలుక‌కు ట్రైనింగ్ ఇస్తారు. వాటిని మ‌చ్చిక చేసుకుని అన్ని విద్య‌లు నేర్పిస్తుంటారు. జ్యోతిష్కుడు వేసే ప్ర‌శ్న‌లు కూడా అర్థం చేసుకునేవిధంగా వాటికి శిక్ష‌ణ ఇచ్చి ఫీల్డ్‌కు దింపుతారు. చిల‌క లాంటి ప‌క్షిపై ఆధార‌ప‌డి వంద‌ల కుటుంబాలు వంద‌ల ఏళ్ల నుంచి జీవ‌నోపాధి పొంద‌డం వెనుక అస‌లు ర‌హ‌స్యం ఇదే. చిల‌క జోస్యం చెప్పుకునే ఒక్కో కుటుంబం రోజుకు రూ.500 నుంచి రూ.1000 వ‌ర‌కు సంపాదిస్తుంటారు.

ఇక చిల‌క చెప్పే జాత‌కం విన‌డానికి ల‌క్ష్మీపూర్ గ్రామానికి కేవ‌లం సామాన్యులే కాదు.. రాజ‌కీయ నేత‌లు, బ‌డా వ్యాపార‌స్తులు, చ‌దువుకున్న వారు సైతం వ‌స్తుంటార‌ట‌. తెలంగాణ‌లోని వేర్వేరు ప్రాంతాల‌తో పాటు ముంబై, బీమండి, సోలాపూర్ ఛ‌తీస్‌ఘ‌డ్ రాష్ట్రాల నుంచి ఇక్క‌డికి వ‌చ్చి చిల‌క జోస్యం చెప్పించుకుంటున్నారు. వంశ‌పారంప‌ర్యంగా వ‌స్తున్న ఈవిద్య‌ను త‌మ భావి త‌రాల‌కు కూడా నేర్పిస్తామ‌ని చెబుతున్నారు చిల‌క జ్యోతిష్కులు. తాము చెప్పే వాటిలో ఎలాంటి మాట‌, మోసం లేద‌ని కాల‌ప‌త్ర గ్రంథాల‌ను చూసి ఇక్క‌డికి వ‌చ్చిన వారికి పంచాంగం చెబుతున్నామ‌ని వారికి అంతా మంచి జ‌రుగుతుంద‌నే న‌మ్మ‌కంతోనే వారు త‌మ‌కు తోచినంత‌గా డ‌బ్బులు ఇచ్చి వెళ్లుతున్నార‌ని చెబుతున్నారు చిల‌క జ్యోతిష్కులు.

Also Read : 

హైపర్ ఆదికి వర్షిని పడిపోయిందా.. ఆ పోస్ట్ వెనుక ఉన్న అంతర్యం ఏంటో..?

 

Visitors Are Also Reading