ప్రపంచంలో ఒక్కడో ఒక చోట వింతలు, విచిత్రాలు, విశేషాలు వంటివి జరుగుతూనే ఉంటాయి. అందులో కొన్ని విషయాల గురించి తెలుసుకున్నప్పుడు ఒకింత ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక సినిమాలో అయితే మరణించకముందే సమాధి బుకింగ్ అనే ఓ కామెడి సన్నివేశం అందరికీ గుర్తుంటుంది. ఆ సినిమాలో కామెడీనే.. కానీ రియల్ సమాధిలో మనిషి పూడ్చిన తరువాత ఆ సమాధికి బార్ కోడ్ ఏర్పాటు చేస్తారు.
ఇక ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ సమాధిలో ఏ వ్యక్తిని పూడ్చిపెట్టారో తెలుస్తుంది. అంతేకాదు పూడ్చిపెట్టిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుస్తాయి. ఇదేమిటి విచిత్రంగా ఉంది ఎక్కడో అని ఆశ్చర్యపోతున్నారా..? ఇది మరెక్కడో కాదండోయ్ జపాన్లో. అవును అండీ. జపాన్, తరుచూ సునామీ బారిన పడే ఈ దేశమైనప్పటికీ ఆ దేశం టెక్నాలజీ విషయంలో రాణిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలలో జపాన్ ఎప్పుడో చేరిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Advertisement
Advertisement
జపాన్ దేశంలో తయారైన ఎలక్ట్రానిక్ వస్తువులకు ఉన్న డిమాండ్ వేరుగా ఉంటుంది. ఈ జపాన్ దేశంలో ప్రజలు పాటించే ఆచారాలు కూడ చాలా డిఫరెంట్గా ఉంటాయి. జపాన్లోని ఎవరైనా మరణిస్తే.. వారిని పూడ్చి సమాది చేస్తుంటారు. అంతేకాదు ఆ సమాధిపైన బార్కోడ్ ను ఏర్పాటు చేస్తారు. బార్ కోడ్ ను స్కాన్ చేస్తే.. ఆ సమాధిలోని పూడ్చిన వ్యక్తి పేరు సహా పూర్తి వివరాలు ప్రత్యక్షమవుతాయి.
Also Read :
గుర్తు పట్టలేనంత మారిపోయిన మహేష్ బాబు చెల్లెలు….ఇప్పుడు ఎక్కడ ఉందో…ఏం చేస్తుందో తెలుసా…!